చిన్న నిర్మాతలు అనేక ఆటుపోట్లు ఎదుర్కొంటూ సినిమాలు నిర్మించి, నష్టపోతున్నారని, వారికి అన్ని వేళల్లో అందుబాటులో వుంటూ చాంబర్ వారి సమస్యలు తీర్చడానికి ప్రయత్నిస్తోందని నిర్మాత నట్టికుమార్ తెలిపారు. ఆయన పాత్రికేయుల సమావేశంలో చిత్ర రంగం గూర్చి పలు విషయాలను చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం పరిశ్రమలో థియేటర్లను తమ గుప్పిట్లో పెట్టుకొని నలుగురైదుగురు వ్యక్తులు మోనోపలి ప్రదర్శిస్తున్నారని, ఈ విధానాన్ని మార్చే ప్రయత్నం ఛాంబర్ చేస్తోందని, ప్రస్తుతం 700 థియేటర్లు రాష్ట్రంలో నలుగురి చేతిలోనే ఉన్నాయని, చిన్న నిర్మాతల కష్టాన్ని సంవత్సరానికి 150 కోట్లు ఆ నలుగురైదుగురే తింటున్నారని, దీన్ని మార్చే ప్రయత్నం జరగాలని ఆయన తెలిపారు. శ్రీమన్నారాయణ నిర్మాత రమేష్ పుప్పాల థియేటర్ ముందు బైఠాయించి చేసిన నిరసనకు స్పందించిన ఛాంబర్, ఆయనకు న్యాయం జరిగేలా ప్రయత్నించి సఫలమైందని, ఏ నిర్మాత అయినా తమ చిత్రం విడుదల చేసుకోడానికి పది రోజులముందే ఛాంబర్‌కు తెలియజేయాలని, అలాచేస్తే ఆయా నిర్మాతలకు థియేటర్ల ఇబ్బంది లేకుండా తాము ప్రయత్నాలు చేస్తామని తెలిపారు. ముందుగా విడుదల తేదీలు ప్రకటించకుండా, ప్రకటించినవి విడుదల కాకుండా పోవడంవల్ల అటు నిర్మాతలు, ఇటు ఎగ్జిబిటర్లు నష్టపోతున్నారని, డిజిటల్ ప్రొజెక్టర్ 35 లక్షలు వెచ్చించి ఎవరు పెట్టుకోవడంలేదని, దానివల్ల సినిమా క్వాలిటీ దెబ్బతింటోందని, నాసి రకం ప్రొజెక్టర్లవల్ల ఇబ్బంది పడుతున్న థియేటర్లలో మంచి ఎక్విప్‌మెంట్ ఉండాలని తాము ప్రయత్నిస్తున్నామని తెలిపారు. థియేటర్లు లీజులకిచ్చేవారు సర్వీస్ టాక్స్ కట్టాలని తాము రికమండ్ చేస్తున్నామని, పది మంది నిర్మాతలు బాగుండాలని ఛాంబర్ కోరుకుంటోందని ఆయన వివరించారు. త్వరలో తమ సంస్థలో యుద్ధం, ఆపరేషన్ దుర్యోధన-2 చిత్రాలు రానున్నాయని, దసరాకు ఓ చిత్రాన్ని విడుదల చేయనున్నామని, తన కుమారుడు కూడా త్వరలో ఏజ్ అలర్ట్ అనే చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడని, ఈ చిత్రంలో 20ఏళ్ల లోపు ఉన్న పరిశ్రమలోని హీరో, దర్శకుల పిల్లలు నటించనున్నారని ఆయన వివరించారు.
చిన్న నిర్మాతలు అనేక ఆటుపోట్లు ఎదుర్కొంటూ సినిమాలు నిర్మించి,
english title:
nirmatala
Date:
Saturday, September 8, 2012