నార్వేలోని ఈ వారధి పేరు - Storeisundetbrua.
చూట్టంతోనే ఈ బ్రిడ్జి ఇంకా పూర్తి కాలేదా? ఏమిటీ? వేగంగా వెళ్తే ఆఖరికి నీళ్లల్లో పడిపోం కదా! అన్న ఆలోచనలో
పడేట్టు ఉంటుంది. ‘రామ్స్డాల్
పెనిన్సులా’ నుంచీ ‘ఏవోరియా’ ద్వీపం వరకూ నిర్మించిన ఈ బ్రిడ్జి ప్రపంచంలోనే
ఎనిమిది వారధుల్లో ప్రముఖంగా చెప్పుకోదగ్గది. బ్రిడ్జి అంతా అనేకానేక
మలుపులతో ఉండటం దీని ప్రత్యేకత. ఈ ప్రాంతం చుట్టుపక్కల అన్నీ ద్వీపాలే. దాంతో ఈ బ్రిడ్జి ఆవశ్యకత మరింత
పెరిగింది. 1989 జూలై 7న ప్రారంభించిన ఈ వారధి పొడవు సుమారు 260 మీటర్లు. 1999 జూన్ వరకూ ఇది ‘టోల్ రోడ్’గా ఉండేది. ప్రస్తుతం పర్యాటకులను
విపరీతంగా ఆకట్టుకొంటోంది.
*
నార్వేలోని ఈ వారధి పేరు -
english title:
norway
Date:
Sunday, September 9, 2012