‘చూడు నిషీలా! చాలా రోజుల్నుంచీ మన మారేజ్ గురించి ఆలోచిస్తున్నా - మనిద్దరం ఉత్తర దక్షిణ ధృవాలం!’
‘ఆ సంగతి నేనెప్పుడో చెప్పాగా?’
‘యా! అందుకని రాత్రి ఒక నిర్ణయం తీసుకున్నా!’
‘గుడ్! ఏంటది?’
‘మనిద్దరం కలిసి ఉండలేం గనుక విడిపోయి ఎవర్దారిన వాళ్లు ఉందాం’
‘నేనూ ఆ రోజు కోసమే ఎదుర్చూస్తున్నా!’
‘ఎందుకు? ఆ వినోద్‌తో కులకడానికా?’
‘ఏం? నువ్వు ఆ రేచల్‌తో కులకటంలా?’
‘ఓకే- బై’
‘బై’
* * *
‘హాయ్ నిషీలా! అయామ్ వినీత్’
‘టెల్‌మీ’
‘ఆర్ యూ హ్యాపీ’
‘చాలా - నువ్వు?’
‘డబుల్ హ్యాపీ’
‘మరి మన డైవర్స్ విషయం ఏమైంది?’
‘ఆ విషయం మాట్లాడ్డానికే వచ్చా’
‘మాట్లాడు’
‘నేను నా గాళ్‌ఫ్రెండ్‌ని మారేజ్ చేసుకోవాలనుకున్నా గానీ - ఇమీడియెట్‌గా చేసుకోవాలంటే కొన్ని ప్రాబ్లెమ్స్ ఉన్నాయ్. కానీ తనేమో అర్జంటుగా పెళ్లయిపోవాల్సిందే అంటోంది’
‘అయితే ననే్నం చేయమంటావ్?’
‘మనిద్దరికీ డైవర్స్ వచ్చేవరకూ నేను నా గాళ్‌ఫ్రెండ్‌ని మారేజ్ చేసుకోవటం కుదరదు గనుక - మన డైవర్స్ ప్రొసీడింగ్స్‌ని కొద్ది రోజులు పోస్ట్‌పోన్ చేయాలి. నువ్ డైవర్స్‌కి ఒప్పుకోవటం లేదు గనుక - తప్పుకునే వరకూ మన మారేజ్ పోస్ట్‌పోన్ చేయక తప్పదని నా గాళ్‌ఫ్రెండ్‌తో చెప్తాను - దాంతో నా ప్రాబ్లెమ్ సాల్వ్ అవుతుంది’
‘డైవర్స్‌ని అలా డిలే చేస్తే మరి నేను వినోద్‌ని మారేజ్ చేసుకోవటం కూడా పోస్ట్‌పోన్ అవుతుంది కదా’
‘కొన్నాళ్లు పోస్ట్‌పోన్ అయినా నీకు నష్టమేం లేదు కదా - అనఫీషియల్‌గా ఎలాగో మీరిద్దరూ సంసారం చేస్తూనే ఉన్నారు’
‘నీకు ఇలా హెల్ప్ చేసినందువల్ల నాకేంటి లాభం?’
‘అంటే?’
‘డైవర్స్ ఒక ఆరు నెలలు పోస్ట్‌పోన్ చేస్తాననుకో! ఈ ఆరు నెలలూ నువ్ నాకు నెలకు పదివేలు మనోవర్తి మొత్తం ఇవ్వాలి’
‘అదేంటి మనోవర్తి విడాకులు తీసుకున్నాక కదా అడగాల్సింది - అదీగాక నువ్వూ ఉద్యోగం చేస్తున్నావ్’
‘అదంతా నాకనవసరం - నెలకు పదివేలిస్తే ఓకే - లేకపోతే వెంటనే డైవర్స్ శాంక్షన్ అయ్యేట్లు చేస్తా’
‘సరే - నెలకు పదివేలిస్తా’
‘్థంక్యూ’
* * *
‘హలో వినీత్’
‘యా - నిషీలా’
‘మన అగ్రిమెంట్ ప్రకారం డైవర్స్ ఆరు నెలలు పోస్ట్‌పోన్ చేశా - ఇవాళ్టితో ఆ గడువు క్లోజయిపోయింది’
‘నిషీలా - ప్లీజ్ - ఇంకో ఆరునెలలు కోపరేట్ చెయ్’
‘చెయ్యాలంటే ఖర్చవుతుంది’
‘నెలకు పదివేలు ఇస్తున్నాగా?’
‘మొదటి ఆరునెలలకే పదివేలు’
‘తర్వాత ఆరునెల్లకి?’
‘నెలకు ఇరవై వేలు’
‘ఇదన్యాయం’
‘అయితే డైవర్స్ -రేపే’
‘ఓకే - ఇరవై వేలిస్తా’
* * *
‘హలో నిషీలా - నేను వినీత్‌ని!’
‘చెప్పు’
‘నా గాళ్‌ఫ్రెండ్‌కి నాకూ చెడిపోయింది. అందుకని నీతోనే సెటిలవదల్చుకున్నా’
‘మొదటి ఆరు నెలలూ - నెలకు నలభై వేలివ్వాలి’
సరదా సంగతులకు సెటైర్ తాలింపు
english title:
hello mike testing
Date:
Sunday, September 9, 2012