శ్రీకాకుళం, సెప్టెంబర్ 14: శ్రీకాకుళం జిల్లాను సాక్షరభారత్ జిల్లాగా ఆవిర్భవింపజేయాలని జిల్లా కలెక్టర్ సౌరభ్‌గౌర్ అధికారులకు పిలుపునిచ్చారు. శుక్రవారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయ సమావేశమందిరంలో మండల ప్రత్యేకాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వయోజన విద్యకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలని ఆదేశించారు. జిల్లాలో 18 ఐటిడిఏ, ట్రస్టర్లను వైద్య శాఖతో అనుసంధానం చేయాలన్నారు. అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. సాక్షర భారత్ సెంటర్లు, కో-ఆర్డినేటర్లు ఉండరాదని, ప్రభుత్వ పాఠశాలభవనాల్లో కొనసాగించాలని చెప్పారు. క్రీడాసామగ్రి, ఇతర పుస్తకాలను సాక్షర భారత్ సెంటర్లలో న్యూస్‌పేపర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి గ్రామ పంచాయతీలో రెండు సాక్షర భారత్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సెంటర్లు ఉదయం ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు, సాయంత్రం ఏడు నుండి తొమ్మిది గంటల వరకు పనిచేయాలని స్పష్టం చేశారు. పల్లెకుపోదాం కార్యక్రమంలో గ్రామం పొలిమేర నుండి సాక్షర భారత్ కేంద్రం పెద్దఎత్తున ర్యాలీలు నిర్వహించాలని తెలిపారు. కార్యక్రమంలో ప్రతి గ్రామ పంచాయతీ నుండి యువజన సంఘాల సభ్యులను కమిటీలో సభ్యులుగా చేర్చాలని ఆదేశించారు. జిల్లాలో పెద్దఎత్తున ఇంటింటా శానిటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు జాయింట్ కలెక్టర్ ఆర్.ఎస్.రాజ్‌కుమార్, డిఆర్‌డిఏ పిడి రజనీకాంతరావు, ఐటిడిఏ పిఒ సునీల్‌రాజ్‌కుమార్, డిఇఒ అరుణకుమారి, డిఎంహెచ్‌ఒ గీతాంజలి, ఆర్‌వి.ఎం పిఒ నగేష్, ఆర్డీఒలు దయానిధి, గణేష్‌కుమార్, విశే్వశ్వరరావు, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాకుళం జిల్లాను సాక్షరభారత్ జిల్లాగా ఆవిర్భవింపజేయాలని జిల్లా కలెక్టర్ సౌరభ్‌గౌర్ అధికారులకు
english title:
sakshara bharat
Date:
Saturday, September 15, 2012