కవిటి, సెప్టెంబర్ 14: నీరు వదిలితే తమకు నష్టమని మత్స్యకారులు.. వదలకపోతే తమ పంట పొలాలు పాడవుతాయంటూ రైతులు. ఇలా చిన్నపాటి వాగ్వాదంతో మొదలైన ఇరువర్గాల గొడవ ఘర్షణకు దారితీసింది. దీనికి బీల వేదికైంది.శుక్రవారం జరిగిన సంఘటనకు సంబంధించి వివరాలివి. కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కళింగపట్నం పరిధిలో బీల నిండి సమీపంలో పొలాలు ముంపునకు గురయ్యాయి. దీంతో రైతులు ఇటీవల ఇద్దివాని పాలెం వద్ద పొగురు తీశారు. అయితే కుసుంపురం నుంచి కళింగపట్నంనకు వేస్తున్న రోడ్డులో భాగంగా బీల ప్రాంతంలో వంతెన నిర్మాణం చేపట్టాల్సి ఉంది. రోడ్డు నిర్మాణం పూర్తయినప్పటికీ.. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతోవంతెన నిర్మాణం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందన మారింది. కాంట్రాక్టర్ వంతెన నిర్మాణం పూర్తి చేయకపోగా.. తాత్కాలికంగా రాకపోకలకు కంకరతో రోడ్డు వేశారు. ఇదిలా ఉండగా ఇటీవల కురుస్తున్న వర్షాలతో బీల నిండి..మండలంలోని మాణిక్యపురం మొదలుకొని నెలవంక వరకు పంట పొలాలు నీట మునిగాయి. దీంతో తేరుకున్న రైతులు ఇద్దివాని పాలెం వద్ద పొగురు తీసి వరద నీరు సముద్రంలోకి వెళ్లేందుకు చర్యలు తీసుకున్నారు. అయితే కళింగపట్నం వద్ద తాత్కాలిక రోడ్డు వల్ల వరద నీరు సముద్రంలో కలిసేందుకు అవకాశం లేకపోయింది. దీంతో వరినారు కుళ్లిపోయే స్థితికి వచ్చింది. ఇది గ్రహించిన బాధిత రైతులు శుక్రవారం రోడ్డు ను తవ్వేందుకు సిద్ధమయ్యారు. ఆ సమయంలోనే కళింగపట్న వాసులు ఆ ప్రాంతానికి చేరుకొని రైతులను అడ్డుకున్నారు. మీ పంటపొలాల కోసం రోడ్డును తవ్వేస్తే మా గ్రామానికి రాకపోకలు స్తంభిస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. పొలాల నుంచి నీరు బయటకు పంపించకపోతే పంటకు నష్టం వాటిల్లుతుందని.. ఎలాగైనా రోడ్డును తవ్వాల్సిందేనంటూ పట్టుబట్టారు. ఇలా ఇరువర్గాల మధ్య మాటామాట పెరిగి ఘర్షం వాతావరణ చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్ ఘటన స్థలానికి చేరుకున్నారు. ఇరువర్గాలతో మాట్లాడి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో పంచాయతీరాజ్ డీ ఈకె.వి. ఎం. ప్రసాదరావు, ఎంపీడీ ఓ శ్రీనివాసరెడ్డి, తహశీల్దార్ గోపాలరావుచేరుకొని ఇరువర్గాలతో చర్చలు జరిపారు. ముంపు నీటి సమస్య తీరేలా పైపులు వేసి నీటిని ఉత్తరం వైపు మళ్లించేలా చేస్తామని చెప్పారు.దీంతో వివాదం సద్దుమణిగింది. స్థానిక ఎస్‌ఐ ఎం.చిన్నంనాయుడు సిబ్బందితోశాంతిభద్రతలను పరిరక్షించారు.
నీరు వదిలితే తమకు నష్టమని మత్స్యకారులు.. వదలకపోతే తమ పంట పొలాలు
english title:
gharshana
Date:
Saturday, September 15, 2012