చీపురుపల్లి, సెప్టెంబర్ 14: పేదల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెడుతోందని రాష్ట్ర రవాణా శాఖామంత్రి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చెప్పారు. శుక్రవారం ఆయన చీపురుపల్లిలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తొలుత మంత్రి బొత్స సత్యనారాయణ చీపురుపల్లిలో కోటి 30 లక్షల వ్యయంతో నిర్మించనున్న మినీ స్టేడియం క్రీడా ప్రాంగణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం నాలుగు కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న పాలకొండ-విజయనగరం రహదారి విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో విద్యార్థుళ కోసం ఏర్పాటు చేసిన మంచినీటి పథకాన్ని ప్రారంభించారు. అనంతరం నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రఒ నిరుఫేద కుటుంబాన్ని ఆదుకోవడమే కిరణ్ సర్కారు ధ్యేయమన్నారు. రాష్ట్రంలో ప్రతి నిరుపేద ఏజబ్బు చేసినా ప్రాణాలు విడిచి పెట్టకుండా ఖరీదైన వైద్యం అందించేందుకు 2008లో ఆరోగ్యశ్రీ పథకం ప్రవేశ పెట్టామన్నారు. రాష్ట్రంలో కొన్ని పార్టీలు కొంత మంది పెద్దలు, నాయకులు, ఆరోగ్యశ్రీ పథకం కొనసాగదు అంటూ ప్రచారం చేస్తున్నారని పేద ప్రజలు ఎవ్వరూ ఆదైర్యపడవద్దని మంత్రి భరోసా ఇచ్చారు. జిల్లాలో ఇప్పటి వరకు 45 వేల మంది రోగులకు ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం అందిందన్నారు. 938 రకాల జబ్బులతో ఈ ప్రభుత్వం పేదవాడికి చేయూతనిస్తుందన్నారు. ఈ సందర్భంగా పట్టణంలో పలు రకాలు సేవలు అందించిన స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు గోవిందరాజులు, రెడ్డిరమణ, శ్రీనివాసరావులను మంత్రి అభినందించారు. అనంతరం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో జరిగిన ఫ్రెషర్స్‌డే ఉత్సవాల్లో మంత్రి బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వీరబ్రహ్మయ్య, డిఎంహెచ్‌ఒ స్వరాజ్యలక్ష్మి, జెడ్పీ మాజీ చైర్మన్ చంద్రశేఖర్, మాజీ ఎంపిపిలు వెంకటనర్సమ్మ, సీర అప్పలనాయుడు ఆర్‌ఇసిఎస్ చైర్మన్ వెంకటరమణ, ఎఎంసి చైర్మన్ విశే్వశ్వరరావు, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ దక్షణామూర్తి పాల్గొన్నారు.
పేదల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెడుతోందని
english title:
botsa
Date:
Saturday, September 15, 2012