Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

ఎరువుల కోసం రోడ్డెక్కిన రైతాంగం

$
0
0

వేపాడ, సెప్టెంబర్ 16: యూరియా కోసం రైతులు రోడ్డెక్కుతున్నారు. మొన్నటి వరకూ తీవ్ర వర్షాభావ పరిస్థితులతో వరి నాట్లకు దూరంగా ఉన్న రైతాంగం ఇటీవల విస్తారంగా కురిసిన వర్షాలతో సాగుకు సిద్ధ మవుతున్నారు. దీంతో ఎరువులకు విపరీతమైన కొరత ఏర్పడింది. రెండులారీలతో బొద్దాం సెంటర్‌కు 400 యూరియా బస్తాలు రావడంతో సిపిఎం ఆధ్వర్యంలో నాలుగుగంటలపాటు ధర్నా చేశారు. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈ విషయం తెలుసున్న ఈగల్ మొబైల్ పోలీసులు అక్కడికి చేరుకుని ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నారు. దీనిపై స్పందించిన వ్యవసాయ అధికారులు ఆ బస్తాలను అక్కడికక్కడే పంపిణీ చేశారు. వర్షాలు పడుతున్న సమయంలో ఎరువులను సకాలంతో సజావుగా అందించేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

రోడ్ల అభివృద్ధికి ప్రణాళికలు: పి.ఆర్ ఇఎన్‌సి
పార్వతీపురం, సెప్టెంబర్ 16: రాష్ట్రంలో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్‌శాఖ ఆధ్వర్యంలో లక్షా 40వేల కిలోమీటర్లను అభివృద్ధి చేశామని ఆ శాఖ రాష్ట్ర ఇంజనీర్-ఇన్-చీఫ్ సివిఎస్ రామ్మూర్తి తెలిపారు. ఆదివారం ఆయన ఇక్కడకు వచ్చిన సందర్భంగా విలేఖరులతో మాట్లాడుతూ ఈ మొత్తం కిలోమీటర్లలో 36వేల కి.మీ తారురోడ్లు, 27వేల కి.మీ మెటల్ రోడ్లు, మిగిలినవి మట్టిరోడ్లుగా అభివృద్ధిచేశామన్నారు. అయితే 70కి.మీ బిటి రోడ్డుగా చేయాలనే ఉద్దేశంతో పి ఎం జి ఎస్ వై కింద 20వేల కి.మీ చేయడానికి కృషి జరుగుతుందన్నారు. కేంద్రప్రభుత్వం రూ.1200 కోట్ల ఐ ఎ పి నిధులతో ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు తూర్పుగోదావరి, అదిలాబాద్ జిల్లాలలో రోడ్ల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించామన్నారు. ఇందులో భాగంగా తొలుత రూ.400కోట్లతో 800కిమీ అభివృద్ధికి 266 పనులు చేపట్టడానికి అంగీకారం కుదిరిందన్నారు. ఇందులో భాగంగా విజయనగరం జిల్లాలోని 124కిమీ అభివృద్ధికి రూ.62కోట్లుతో 32రోడ్లు పనులు చేపడుతున్నామన్నారు. గిరిజన ప్రాంతాల్లోని 250నుండి 499మంది జనాభాకలిగిన ప్రాంతాల్లో ఈరోడ్ల పనులు చేపడతామన్నారు. 2014లోగా ఈపనులన్నీ పూర్తిచేయడానికి నిర్ణయించామన్నారు. ఐ ఎ పి కింద రెండవ విడత రూ.800కోట్ల నిధులు వచ్చే అవకాశాలున్నాయన్నారు. అదేవిధంగా నాబార్డు నిధులతో రూ.200కోట్లతో 126పనులు రోడ్డుపనులు చేపడుతున్నామన్నారు. అలాగే మారుమూల గిరిజన ప్రాంత అభివృద్ధి పథకం కింద 18జిల్లాల్లో రూ.397కోట్లతో 5వేల జనాభాకలిగిన ప్రాంతాల్లో పనులు చేపడుతున్నామని చెప్పారు. అలాగే బి ఆర్ జి ఎఫ్ నిధులు రూ.375కోట్లతో తెలంగాణ ప్రాంతంలోని జిల్లాల్లో రోడ్లను అభివృద్ధి చేస్తున్నామన్నారు.
తుపాను పనులకు రూ.720కోట్లు
తుపానుకు దెబ్బతిన్న రోడ్ల అభివృద్ధికి రాష్ట్రప్రభుత్వం రూ.720కోట్లు నిధులు మంజూరు చేసిందన్నారు. ఇందులో ఇప్పటికే రూ.590కోట్లు వ్యయం చేసి పనులు చేపట్టామన్నారు. అయితే పర్మినెంట్ పనులకు మరోరూ.వెయ్యికోట్లతో ప్రతిపాదనలు చేశామన్నారు. ఇదిలా ఉండగా రూ.31కోట్లతో పంచాయతీరాజ్‌శాఖ భవనాల మరమ్మతులు చేపట్టే చర్యలు తీసుకున్నామని ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ రామ్మూర్తి తెలిపారు. రాష్ట్రంలో వివిధ పాఠశాలల్లో 70వేల అదనపుతరగతి గదుల నిర్మాణం చేపడుతున్నామన్నారు. అలాగే భవనాల నిర్వహణకు ఏడాదికి రూ.11కోట్లు వ్యయం కాగలదన్నారు. జిల్లాకు రూ.70లక్షల వంతున నిర్వహణ వ్యయం అవుతుందన్నారు. ఖమ్మం జిల్లాలోని ఫారెస్ట్ క్లియరెన్సు కోసం నష్టపరిహారం రూ.2.5కోట్లు ఇవ్వడం జరిగిందన్నారు. ఈమేరకు 14రోడ్లకు అటవీశాఖ క్లియరెన్సు వస్తుందన్నారు. రాష్ట్రంలోని రూ.296కోట్లతో 427బ్రిడ్జిల నిర్మాణాలకు పి ఎం జి ఎస్ వై పథకం నిధులు మంజూరయ్యాయని రామ్మూర్తి తెలిపారు. ఇందులో ఇప్పటికే 127 బ్రిడ్జిల నిర్మాణాలు పూర్తయ్యాయన్నారు. విజయనగరం జిల్లాలోని నాగావళి నదిపై పూర్ణపాడు వద్ద వంతెన నిర్మాణానికి రూ.7కోట్ల నిధులు మంజూరయ్యాయని ఈపనులకు టెండర్లను పిలుస్తున్నామని చెప్పారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్‌శాఖ ఎస్‌ఇ బివిఎస్ చిరంజీవిరావు, ప్రాజెక్ట్సు ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు కె.శ్రీనివాసకుమార్‌లు పాల్గొన్నారు.

ధూళికుప్పలో అతిసార
కురుపాం, సెప్టెంబర్ 16: మండలంలోని ధూళికుప్ప గ్రామంలో అతిసార వ్యాధి వ్యాపించి 15మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గ్రామానికి చెందిన 50మందికి వరకు అతిసార వ్యాధి సోకిందన్న సమాచారం ఉన్నప్పటికీ వీరిలో 15మందికి అతిసార వ్యాధి ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. గ్రామానికి చెందిన జ్యోతి, ఆండాళి, పాపత్రి, జోనేష్, బంబిడో, మల్లి అనే వ్యక్తులు మొండెంఖల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అలాగే బిడ్డిక వెంకటమ్మ, పోడంగి గంగయ్య, నిర్మల, కుమారి, సన్యాసిరావు అనే రోగులు కురుపాం ఆసుత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆదివారం ఉదయం నుంచి అతిసార వ్యాపించడంతో ఆయా ఆసుపత్రులకు తరలించారు. మొండెంఖల్ ఆసుపత్రిలో డాక్టర్ ఉదయ్‌కుమార్ చికిత్స చేసి మందులను అందించారు. ప్రస్తుతం రోగులంతా ఆసుపత్రిలో కోలుకుంటున్నారు. గ్రామంలో ఉన్న ఒక బోర్ వెల్ నుంచి వచ్చే నీటిని తాగడం వల్ల డయేరియా వ్యాపించిందని గ్రామస్థులు తెలిపారు. ఇటీవల కాలంలో తొట్టంగి, మామిడిమానుగూడ గ్రామాల్లో కూడా డయేరియా వ్యాపించింది. పలు గ్రామాలల్లో అతిసార వ్యాపించడంతో గిరిజనులు ఆందోళన చెందుతున్నారు.

యూరియా కోసం రైతులు రోడ్డెక్కుతున్నారు.
english title: 
roddekkina raithangam

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>