విజయనగరం ,సెప్టెంబర్ 16: జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా బ్యాంకింగ్ సేవలు అందించాలని అధికారులు నిర్ణయించారు. గోడౌన్ సదుపాయం ఉన్న అన్ని సంఘాల్లో బ్యాంకింగ్ కౌంటర్లను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఈ మేరకు గ్రామస్థాయిలో రైతాంగానికి సహకార సంఘాల ద్వారా సేవలను మరింత అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు చేపడుతున్నారు. దీనిలోభాగంగా సహకార సంఘాలను రైతుసేవా కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సహకార సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు అవసరమైన సహకారాన్ని పూర్తిస్తాయిలో అందించాలని నిర్ణయించారు. గ్రామస్థాయిలో సహకార సంఘాల ద్వారా విత్తనాలు, ఎరువుల విక్రయంతోపాటు రైతులు పండించే పంటలను కొనుగోలు చేసే దిశగా చర్యలు చేపడుతున్నారు. దీనికి సంబంధించి జిల్లా సహకార కేంద్ర బ్యాంకు చైర్‌పర్సన్ మరిశర్ల తులసి, బ్యాంకు సిఇఒ వంగపండు శివశంకర ప్రసాద్ ప్రత్యేకంగా దృష్టిని కేంద్రీకరించారు. జిల్లాలో 94 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాల ద్వారా ఇప్పటికే ఎరువుల విక్రయాలను చేపడుతున్నారు. అదేవిధంగా రైతులు పండించే పంటలను కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా బ్యాంకింగ్‌సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు వీలుగా సహకార సంఘాల్లో బ్యాంకు కౌంటర్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. అలాగే బంగారునగల హామీపై రుణసౌకర్యం కల్పించేందుకు వీలుగా తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో గోడౌన్ సదుపాయం ఉన్న అన్ని సంఘాల్లోను రైతులకు అందుబాటులో సేవలు అందిండంతోపాటు ఆయా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయాలని నిర్ణయించారు.
జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా బ్యాంకింగ్
english title:
farmers co-op societies
Date:
Monday, September 17, 2012