గజపతినగరం, సెప్టెంబర్ 16: డీజిల్ ధర పెంపు, వంట గ్యాస్ సిలండర్ల సరఫరాలో కోత విధిస్తు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు కార్యకర్తలు ఆదివారం ఇక్కడ వంటా,వార్పుతో నిరసన వ్యక్తం చేశారు. వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ శీరం రెడ్డి పెద్దినాయుడు, మహిళానాయకురాలు శారదానాయుడు ఆధ్వర్యంలో కార్యకర్తలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జాతీయ రహదారి మధ్యలో వంటా, వార్పు జరుపడానికి ప్రయత్నించగా పొలీసులు అడ్డుకున్నారు. రాకపోకలకు అటంకం కలిగించే విధంగా నిరసన జరపవద్దని పొలీసులు అభ్యంతరం తెలపడంతో రోడ్టు పక్కన జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అంతకు ముందు పాత సినిమా హాలు వద్ద గల వైఎస్సాఆర్ విగ్రహం వరకూ కార్యకర్తలుతో ప్రదర్శనగా వెళ్లి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు జంపన పెదబాబు, బి.రామ్జీ, మిత్తిరెడ్డి శ్రీనివాసరావు, ఈదుబిల్లి కృష్ణ, పడాల అప్పలనాయుడు, మీసాల అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.
డీజిల్ ధర పెంపు, వంట గ్యాస్ సిలండర్ల సరఫరాలో కోత విధిస్తు
english title:
vanta vaarpu
Date:
Monday, September 17, 2012