గజపతినగరం, సెప్టెంబర్ 16: అమరుల ఆశయాల మేరకు దివంగత నేత ఆర్.కుప్పానాయుడు పోరాటాలు చేశారని సిపిఎం అనుబంధ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు చౌదరి తేజేశ్వరరావు అన్నారు. ఆదివారం స్థానిక వాసవీకళ్యాణమండపంలో జరిగిన సంస్మరణ సభలో ఆయన ప్రసంగించారు. సిపిఎం నాయుకులు దివంగత నేత పుచ్చలపల్లి సుందరయ్యను స్ఫూర్తిగా తీసుకుని పేద రైతు వ్యవసాయ కార్మికుల సమస్యలపై రాజీలేని పోరాటాలు చేశారన్నారు. కుప్పానాయుడు ఉన్నత విద్యను అభ్యసించినప్పుడే బ్రహ్మచారిగా ఉంటూ జీవితాన్ని ప్రజాసమస్యలకు అంకితం చేశారని కొనియాడారు. జిల్లాలోని పురిటిపెంట గ్రామాన్ని కేంద్రంగా చేసుకుని చేసిన పోరాటాలు వివరించారు. మాజీమంత్రి పడాల అరుణ మాట్లాడుతూ కుప్పానాయుడు అలుపెరగని విధంగా గిరిజన ప్రాంతాల్లో పర్యటించారన్నారు. పార్టీ నిర్ణయాలకు కట్టుబడి రెండుసార్లు తన గెలుపుకు సహకరించారన్నారు. గుర్లగెడ్డ మినీ రిజర్వాయర్ నిర్మాణానికి కలిసి పనిచేసిన విషయాన్ని గుర్తు చేశారు. కాంగ్రెస్ మండల శాఖ అధ్యక్షుడు కరణం ఆదినారాయణ మాట్లాడుతూ గోర్జిబట్టి కాల్వను కుప్పానాయుడు వెలుగులోకి తీసుకు వచ్చారని అన్నారు. లోక్‌సత్తాపార్టీ నాయుకులు యు.ఎస్.ఎస్ వర్మ మాట్లాడుతూ కుప్పానాయుడు నిరాడంబరతను వివరించారు. విద్యా సంస్థల అధినేత రావి శ్రీ్థర్, జిల్లా రైతు సంఘం ఉపాధ్యక్షుడు మర్రాపు సూర్యనారాయణ, సిపిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.కృష్ణమూర్తి, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షరాలు శేషారత్నం, గొర్లె శ్రీను , మాజీ ఎమ్మెల్యే కోలక లక్ష్మణ మూర్తి, సిపిఎం అనుబంధ సంఘాలకు చెందిన నాయకులు వంజిరాపు సత్యంనాయుడు, రాకోటి రాములు, టి.వి రమణ, పురం అప్పారావ పాల్గొన్నారు. కుప్పానాయుడు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
కాజ్‌వే లేక పది గ్రామాల ప్రజల అవస్థలు
మెంటాడ, సెప్టెంబర్ 16: వర్షాలు పడితే మండల కేంద్రానికి ఈత వచ్చిన వారే రావాలి! మెంటాడకు ఆగూరు, సారాడవలస, రెల్లిగూడెం, సంగంగుడ్డివలస, రాయవలస, మాల్యాడవలస, తమ్మిరాజుపేట, పనుకువాని వలస గ్రామాల మధ్య చంపావతి నది ఉంది. విశాఖ జిల్లా అనంతగిరి మండలంలోని కోండలపై వర్షాలు పడితే గుర్లగడ్డ ద్వారా ఆ నీరు చంపావతి నదిలో చేరి నది ఉద్ధృతమవుతుంది. పాచిపెంట మండలంలో కండపై వర్షాలు పడితే ఎర్రగడ్డట, చిట్టిగడ్డ, నందిపూరి గెడ్డల ద్వారా ఆండ్ర వద్ద చంపావతి నదిలో కలుస్తుంది. దింతో ఈ నది మరింత ఉధ్ధృతంగా ప్రవహిస్తుంది. నదీ ప్రవాహల సమయంలో ఆయా గ్రామాల మధ్య రాకపోకలు నిత్యం సమస్యగా మారింది. ఈ గ్రామాల నుండి ప్రజలు మండల కేంద్రమైన మెంటాడకు రావాలంటే చంపావతి నదిని దాటి రావాల్సీందే. వర్షాకాలంలో ప్రవాహ ఉద్ధృతికి కొన్ని రోజులు పాటు రాకపోకలు స్తంభించి పోతున్నాయి. ప్రవాహం వలన పది గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గత ఏడాది రెల్లి గూడెంకు చెందిన మహిళ గెడ్డలో కోట్టుకుపోయి కొణిశ సమీపంలో లభ్యమయింది. తమ్మిరాజు పేట వద్ద నిర్మించిన కాజేవే నాణ్యతలో లోపం వలన ఏడాది కాలంలోనే కోట్టుకుపోయింది. ఆగూరు మెంటాడ గ్రామాల మద్య కాజేవే నిర్మంచాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. నిత్యవసర సరకులు, విద్యార్ధులు ఇతరత్రా పనులు విషయమే మెంటాడ పైన ఆధార పడాల్సిందే. అందువలన పీకల్లోతు నీటినైనా చంపావతి నదిలో దిగి మెంటాడకు వెళ్లాల్సి ఉంటుంది.ప్రయాణంలో ఉన్నపుడు భారీ వర్షం పడితే స్వగ్రామాలకు చేరుకోలేని సందర్బాలు ఉన్నాయి. మెంటాడ వద్ద మిని వంతెన నిర్మించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.అత్యవసర పరిస్థితుల్లో నదిలో దిగి ఈత కొట్టి దాటాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. లేదంటే పది కిలోమీటర్లు బట్టి కాలువగండా గజపతినగరం బ్రిడ్జిదాటి రావాల్సి వస్తోంది. గతంలో ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి. ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు, ఉన్నత అధికారులు ప్రజల అవస్థలు పట్టించుకుని సౌకర్యం కల్గించాలని ప్రజలు కోరుతున్నారు.