విశాఖపట్నం, సెప్టెంబర్ 17: రాష్ట్రంలో ముఖ్యమంత్రిని మారుస్తారనే ప్రచారం జోరుగా జరుగుతోందని, అటువంటి మార్పులకు ఎటువంటి అవకాశం లేదని రాజ్యసభ సభ్యులు చిరంజీవి అన్నారు. సోమవారం విశాఖకు వచ్చిన ఆయన విమానాశ్రయంలో విలేఖరులతో మాట్లాడుతూ సిఎంను మారుస్తారని కొంతమంది పనికట్టుకుని ప్రచారం చేస్తున్నారన్నారు. అటువంటి ఆలోచన అధిష్ఠానానికి లేదని ఆయన చెప్పారు. తనకు మంత్రి పదవి.. లేదా మరే ఇతర పదవైనా లభిస్తుందని ప్రచారం జరుగుతోందని, అయితే ఆ పదవులను తనకంటే తన అభిమానులు ఎక్కువగా కోరుకుంటున్నారన్నారు. ఇది ఎపుడైనా సాధ్యపడుతుందన్నారు. కాంగ్రస్ పార్టీలో విభేదాలు ఏమాత్రం లేవని, అధిష్ఠానం ఆదేశాల మేరకు అంతా కలిసికట్టుగా పనిచేస్తామని చిరంజీవి స్పష్టం చేశారు.
* ఇప్పట్లో సిఎం మార్పు లేదు * రాజ్యసభ సభ్యుడు చిరంజీవి
english title:
chiranjeevi
Date:
Tuesday, September 18, 2012