సూర్యాపేట, సెప్టెంబర్ 17: విద్యార్థుల్లో శారీరక పెరుగుదలను పెంపొందించేందుకు వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో పంపిణీ చేస్తున్న నట్టల నివారణ మందులు వేసుకున్న 30మంది పాఠశాల విద్యార్థులు అస్వస్థత గురయ్యారు. పట్టణంలోని చర్చికాంపౌండ్‌లోని న్యూ మిలీనియం పాఠశాలలో మధ్యాహ్నా భోజనం ముగించిన తర్వాత నట్టల నివారణ మందులను పంపిణీ చేశారు. మాత్రలు వేసుకున్న కొంత సేపటికి విద్యార్థులు వాంతులు చేసుకున్నారు. సుమారు 35మంది అస్వస్థత పాలుకాగా స్కూలు యాజమాన్యం వారిని హుటాహుటిన ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో విద్యార్థులందరికీ చికిత్స అందించారు. 5వ తరగతి విద్యార్థులు అనుపమ, చందన్, సంధ్య, ఆదర్శ్, నితీష్‌లు ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మిగిలిన వారిని పరీక్షించి ఇంటికి పంపించివేశారు. బలహీనంగా ఉన్న విద్యార్థులు మాత్రలు వేసుకుని అస్వస్థతకు గురయ్యారని, ప్రాణాపాయం లేదన్నారు.
విద్యార్థుల్లో శారీరక పెరుగుదలను పెంపొందించేందుకు వైద్య ఆరోగ్యశాఖ
english title:
deworming
Date:
Tuesday, September 18, 2012