విశాఖపట్నం, సెప్టెంబర్ 17: విశాఖ జిల్లా అటవీ ప్రాంతంలో తొలిసారిగా పెద్ద పులులను అటవీ శాఖ గుర్తించింది. 2011 సంవత్సరాంతం వరకు రాష్ట్రంలోని పెద్ద పులులు, చిరుత పులులు తదితర వన్యప్రాణుల గణనను అటవీశాఖ పూర్తి చేసింది. వీటి సంఖ్యను గతనెలలో మదింపు చేసింది. విశాఖ జిల్లా అటవీ ప్రాంతంలోని మంపా, కేడి పేట, ప్రాంతాల్లో నాలుగు పెద్ద పులులున్నట్టు గుర్తించారు. ఇందులో ఒకటి ఆడ పులి, రెండు పులి పిల్లలు ఉండగా, ఒక పులి లింగ నిర్ధారణ జరగలేదు. ఇదిలాఉండగా ఇంత వరకు విశాఖ అటవీ ప్రాంతంలో పెద్ద పులులు తొలిసారిగా కనపించడం అటవీశాఖ అధికారులు విస్మయపరిచింది. ఇదిలాఉండగా చిరుతల విషయానికొస్తే వీటి సంఖ్య కూడా విశాఖ జిల్లాలో గణనీయంగా ఉంది. కంబాల కొండ అటవీ ప్రాంతంలో మూడు చిరుతలున్నట్టు అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఇందులో ఒకటి మగది, మరొకటి ఆడది కాగా, మరొకటి పిల్ల. అలాగే సీలేరు ప్రాంతంలో మరో చిరుత పులి ఉన్నట్టు గుర్తించారు. కాగా అటవీశాఖాధికారుల లెక్కల ప్రకారం జిల్లాలో చిరుత పులుల సంఖ్య నాలుగే ఉన్నట్టు చెబుతున్నప్పటికీ ఇంకా ఎక్కువుగానే ఉండవవచ్చని భావిస్తున్నారు. ఇక ఉత్తరాంధ్ర జిల్లాల్లో 200కు పైగా ఎలుగుబంట్లు ఉన్నట్టు లెక్కల్లో తేలింది. వీటి పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులను కేటాయిస్తున్న నేపధ్యంలో వీటి పరిరక్షణకు మరిన్ని చర్యలు తీసుకుంటామని అధికారులు తెలియజేశారు. కాగా పెద్ద పులుల ఆహారానికి విశాఖ ఏజేన్సీలో కొరత లేనప్పటికీ వేసవికాలంలో వీటికి తాగునీటి సౌకర్యం కల్పించేందుకు చర్యలు చేపడతామని చీఫ్ కనె్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శ్రీనివాస్ ఆంధ్రభూమికి తెలిపారు.
* తొలిసారిగా గుర్తింపు
english title:
tigers
Date:
Tuesday, September 18, 2012