ఆదోని, సెప్టెంబర్ 17: కర్నూలు జిల్లా ఆదోనిలో వ్యాపారులు అక్రమంగా నిల్వ ఉంచిన రూ. 4 కోట్ల విలువ చేసే శనగపప్పును విజిలెన్స్ అధికారులు సోమవారం సీజ్ చేశారు. ఆదోనికి సమీపంలోని ఢణాపురం గ్రామం వద్ద ఉన్న గణేష్ గ్రామీణ గోదాముల్లో రైతుల పేర వ్యాపారులు అక్రమంగా నిల్వ ఉంచిన రూ.4 కోట్ల విలువ చేసే 15,489 బస్తాల సెనగపప్పును విజిలెన్స్ అధికారులు సోమవారం సాయంత్రం సీజ్ చేశారు. విజిలెన్స్ ఎస్సై పవన్‌కిశోర్, ఎఓ వెంకటేశ్వర్లు, స్పెషల్ తహశీల్దార్ బుచ్చేంద్ర, డిసిటిఓ లక్ష్మినాయక్ గోదాంపై దాడి చేసి అక్రమంగా నిల్వ ఉంచిన బస్తాలను సీజ్ చేశారు. గోదాం వద్ద లారీలోకి లోడు చేస్తుండగా సమాచారం అందుకున్న అధికారులు దాడులు చేశారు. లోడు లారీ ఎవరిదని విచారించగా మోహన్‌రెడ్డిదని చెప్పారు. మోహన్‌రెడ్డికి చెందిన స్టాకు రిజిష్టర్లను తనిఖీ చేయగా పెద్దమొత్తంలో అవకతవకలు బయటపడ్డాయి.
కర్నూలు జిల్లా ఆదోనిలో వ్యాపారులు అక్రమంగా నిల్వ ఉంచిన
english title:
dal
Date:
Tuesday, September 18, 2012