సాధారణంగా పిట్టలు పీకినట్టు జుట్టు ఉంటే ‘‘ఏందిరోయ్ నీ జుట్టు ఐన్‌స్టీన్‌లా ఉంది’’ అంటారు. మా వాళ్లు కాలేజీల్లో ‘‘ఏమిటోయ్ ఈ ఈజీక్వల్టు ఎమ్‌సీ స్క్వేర్’’ (ఐన్‌స్టీన్ ఫార్ములా) అంటూ పిలిచేవారు పాపం! ఇదే మాట కాలోరెడో రాష్ట్రంలోని డాన్వర్ పట్టణంలో ఒక వార్తాహరుడు ఓ చిన్న బాబుని (రెండేళ్ల వాడు) ‘‘ఏమిటోయ్! నీ క్రాఫింగు ఈ ఈజీక్వల్టు ఎమ్‌సీ స్క్వేర్‌లా వుంది. నువ్వు ఐన్‌స్టీన్‌వా?’’ అన్నాడు. అంతే ఆ బాబు బా..మని బాకా అందుకున్నాడు. ఆ విలేఖరి పేరు డాన్. ఆ ఊరికి కొత్త. ఓ జాతరని కవర్ చేద్దామని వచ్చాడు. ‘‘బాబూ! నాయనా! నోరు మూయరా’’ అంటూ పిల్లవాడ్ని ఓదార్చే సరికి పాపం ఆ రిపోర్టర్‌కి తల ప్రాణం తోకకి వచ్చింది. ‘అందాల హీరోలా వున్నావు’’అంటూ బతిమాలాడు. ఆ బాలుడు అప్పటికి రాజీపడ్డాడు కానీ రారా అని దగ్గరికి తీసుకుని ముద్దాడపోతే అసింటా జరిగాడట. ‘‘పిల్లలా? కాదండీ! పిడుగులు’’ ఈ కాలంలో.
పాపం చావ బాదేశారు!
ఈనెల 20న ఇరాన్‌లో జరిగింది ఈ సంఘటన. పట్టణాలలో కూడా కాదు పల్లెటూరులో మసీదు సందులో నుంచి ఇద్దరమ్మాయిలు పోతున్నారు. మత గురువు ఒకాయన అటుగా వస్తూ ‘‘ఏమమ్మా! హిజాబ్ (తల మీద ముసుగు) సరిగా వేసుకోరాదా?’’ అంటూ చీవాట్లు వేశాడు. అంతే! ఆ మగువులకి అరికాలి మంట నెత్తికెక్కింది. ఆ మత గురువుని పట్టుకుని ఆ ఇద్దరూ చెరో వైపు ఎడాపెడా వాయించి వదిలిపెట్టారు. అందరూ స్థాణువులైపోయారు. పోలీసులు గానీ లేదా మత గురువులు గానీ ముసుగు సరిగా వేసుకోమని హెచ్చరిస్తే ఇరాన్‌లో గ్రామ వాసులు ఎదురు తిరగరు. హిజబ్‌ని సద్దుకుంటారు. పోలీసులు వాళ్లంతట వాళ్లు విచారించితేనే మంచిది అని ఆ మత గురువు అన్నాడని సి.ఎన్.ఎన్. భోగట్టా. ‘‘లేచింది మహిళా లోకం అనొచ్చా’’.
నిమజ్జనం తర్వాత అసలు కథ!
హుస్సేన్‌సాగర్‌లో ఈ నెల 29న నిమజ్జనం తర్వాత కనీసం పాతిక వేల వినాయక విగ్రహాలు-కొన్ని అందులో ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో చేసినవి పడి ఉంటాయి. వీటిని జీవ వైవిధ్య సదస్సుకి వస్తున్న విదేశీ ప్రముఖులకు చూపెట్టాలంటే ఎట్లా? సాగర్‌లో ‘కాలుష్యం’ లెవెల్ దాటిపోయి, సుమారు పదకొండు వేల టన్నుల కార్బన్ డయాక్సైడు అంటే బొగ్గుపులుసు వాయువు విడుదల అవుతుందని అంచనా.
‘హుస్సేన్‌సాగర్‌ని కేవలం రెండురోజుల్లో- విగ్రహ శకలాల్ని ఏరివేసి శుభ్రం చేయాలంటే-మానవ మాత్రులకి సాధ్యమా?’ అంటున్నారు. ఐతే-ఒక్క ఐడియా ఉంది. విదేశీ ప్రముఖులకి-ఓ ఎయిర్ కండిషన్డ్ అద్దాల బస్సు పెట్టి-హుస్సేన్ సాగర్ చుట్టూ తిప్పి చూపించవచ్చు. అదే బెటర్ మరి! కంపు తెలియకుండా ఉంటుంది- జై.. గణేశా!
సాధారణంగా పిట్టలు పీకినట్టు జుట్టు ఉంటే ‘‘ఏందిరోయ్ నీ జుట్టు ఐన్‌స్టీన్‌లా ఉంది’’
english title:
nee
Date:
Wednesday, September 26, 2012