Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

సెన్సార్స్‌తో ఉపయోగాలెన్నో

$
0
0

వై ద్యం ఇప్పుడు కంప్యూటరైజేషన్ అయిపోయింది. ఇప్పుడు ట్రీట్‌మెంట్ చెయ్యడం, వ్యాధి నిర్థారణ చెయ్యడం ఎంతో సులభం. ‘సెన్సార్లు’లో ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్ ఉంటుంది. దానికి వ్యాధి వివరాలు ఇచ్చి ఫీడ్ చేస్తారు. ఏ కాస్త ఐటెమ్ దొరికినా అది స్క్రీన్‌మీద చూపించేస్తుంది.
ప్రిగ్నెన్సీ సెన్సార్లు ఈ సెన్సార్లులో యూరిన్ ఓ చుక్క వేస్తే చాలు గర్భిణియో కాదో ఠక్కున చెప్పేస్తుంది. మూత్రంలో ‘హ్యూమన్ కొరియోనిక్ గోనడోట్రోఫిన్లు’ వుంటాయి. వాటి ఆధారంగా ఇది పనిచేస్తుంది.
డయాబెటిక్ సెన్సార్లు: దీన్నుండి చిన్న సూది బయటికొచ్చి రక్తపు చుక్కని తీస్తుంది. దాన్లో షుగర్ శాతం ఎంత వుందో చెప్పవచ్చు.
బి.పి.సెన్సార్లు: బి.పి ఎక్కువైతే రక్తప్రసరణ వేగం పెరుగుతుంది. రక్తనాళాలు గట్టిపడటం ఆధారంగా ఇవి పనిచేస్తాయి. శరీరంలోని సోడియం, పొటాషియం లవణాల శాతం ప్రకారం లెక్కించి సరియైన బి.పి. వివరాలు అందజేస్తాయి.
ఫిట్స్ సెన్సార్లు: ఫిట్స్, మూర్ఛ వచ్చేముందు శరీరంలోని కాల్షియం తగ్గడం లేదా ‘ఎలక్ట్రో ఎన్‌సెఫలోగ్రామ్’ తరంగాల స్వభావం ఆధారంగా ఇవి పనిచేస్తాయి. దాని ద్వారా మూర్ఛ ఎప్పుడొస్తుందో, ఫిట్స్ ఎప్పుడొస్తాయో అంచనా వేయవచ్చు.
మలేరియా సెన్సార్లు:
యూనివర్సిటీ ఆఫ్ గ్లాస్‌గోమా వాళ్లు ఈమధ్య కొత్తగా మలేరియా సెన్సార్లు కూడా ఉత్పత్తి చేస్తున్నారు. మొబైల్ ఫోన్లో ఈ సెన్సార్లు అమరుస్తున్నారు. ఎర్రరక్తకణాల్లోని మలేరియా వ్యాధి క్రిముల్ని ఈ సెన్సార్లు అతి తేలిగ్గా గ్రహిస్తాయి.
టైఫాయిడ్ సెన్సార్లు: టైఫాయిడ్ విషజ్వరం ‘సాల్మోనెల్లాటైఫీ’ అనే క్రిమివల్ల వస్తుంది. శరీరపు ఆంటిజెన్, కశాభపు యాంటిజెన్‌లనీ ఇవి గ్రహించి జ్వరం టైఫాయిడ్‌వల్లనోకాదో చెబుతాయి

వై ద్యం ఇప్పుడు కంప్యూటరైజేషన్ అయిపోయింది.
english title: 
sensar
author: 
-డాక్టరు. కె.సంధ్యారాణి

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>