మా అమ్మాయి ఇంటర్ చదువుతున్నది. రెండు మూడేళ్ళనుంచి ఆమె ప్రవర్తన ఆందోళన కలిగిస్తున్నది. ఆమె వేషధారణ, వ్యవహారశైలి అబ్బాయిని తలపించేలా ఉంది. ప్యాంటు, షర్టు మాత్రమే వేసుకుంటుంది. తల క్రాప్ చేయించుకుంటుంది. నడక కూడా అబ్బాయిలానే వుంటుంది. కనీసం పంజాబి డ్రెస్ వేసుకోమన్నా ససేమిరా అంటుంది. అసలు అమ్మాయిలా ఉండాలంటేనే అసహ్యమంటుంది. సిగ్గు, బిడియం, సంకోచం లాంటివి ఆమెలో వెదికినా కనిపించవు. రుతుక్రమం సాధారణంగా ఉంది. ఇలా ఉంటే అబ్బాయిలెవరూ పెళ్ళిచేసుకోరంటే, అసలు తనకు పెళ్ళేవద్దంటుంది. మిలటరీ లేదా పోలీసు శాఖలో ఉన్నత ఉద్యోగం సంపాదించి దేశ సేవ చేస్తానంటుంది. ఈ మధ్య చదువులో కూడా వెనకబడుతోంది. ఆమె వ్యవహారం అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. సరైన పరిష్కారం చూపండి. -కె.రమణ దీక్షితులు, కావలి
మీ అమ్మాయిది తీవ్రమైన సమస్యేమీ కాదు. మీరు మనస్సులో భావిస్తున్నట్లు అబ్బాయిలా మారిపోయే ప్రమాదమేమీ లేదు. హార్మోన్లు, ఆలోచనల్లో లోపాలవల్ల కొందరు యువతీ యువకులు ఇలా ప్రవర్తిస్తుంటారు. అమ్మాయిలు అబ్బాయిలా ప్రవర్తించడాన్ని ‘లూమ్‌బాయ్ కాంప్లెక్స్’ అంటారు. వీరు మగవారిలా ప్యాంటు, షర్టు వేసుకుని వారిలాగా ఉండేందుకు ప్రయత్నిస్తుంటారు. అలాగే కొందరు అబ్బాయిలు అమ్మాయిలా కనిపించే ప్రయత్నం చేస్తుంటారు. అంతమాత్రాన అబ్బాయి అమ్మాయిలా, ఆమె అతనిలా మారిపోయే ప్రమాదమేమీ ఉండదు. మీ అమ్మాయిలో రుతుక్రమం సాధారణంగానే ఉందన్నారు. అలాగే శారీరక ధర్మాలు, లక్షణాలలో తేడా ఏమైనా ఉందా అన్న విషయం గమనించండి. వీలైతే మంచి డాక్టరను సంప్రదించి పరీక్షలు చేయించండి. ఆయన సలహాలు పాటించడంతోపాటు కౌనె్సలింగ్ చేయించటానికి ప్రయత్నించడంతోపాటు కౌనె్సలింగ్ చేయించడానికి ప్రయత్నించండి. ఆమె వ్యవహార శైలిపై ఇంట్లోను, కాలేజీలోను సమస్యలు ఎదురవుతుండవచ్చు. మనసు విప్పి, అనునయంతో మాట్లాడండి. ఆమె మనసు అర్థం చేసుకుని వ్యవహరించండి. వాకింగ్, ధ్యానం సాధన చేయించండి. అన్నీ సర్దుకుంటాయి.
మా అమ్మాయి ఇంటర్ చదువుతున్నది. రెండు మూడేళ్ళనుంచి ఆమె ప్రవర్తన ఆందోళన కలిగిస్తున్నది.
english title:
deeniki
Date:
Wednesday, September 26, 2012