పల్లేకల్, సెప్టెంబర్ 27: టి-20 ప్రపంచ కప్ చాంపియన్‌షిప్ ‘సూపర్-8’లో శ్రీలంక సూపర్ విక్టరీని నమోదు చేసుకుంది. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్ ‘టై’కావడంతో ఫలితాన్ని తేల్చడానికి ‘సూపర్ ఓవర్’ అనివార్యమైంది. ఈ ఓవర్‌లో శ్రీలంక ఒక వికెట్‌కు 13 పరుగులు చేయగా, న్యూజిలాండ్ ఒక వికెట్ నష్టానికి ఆరు పరుగులకే పరిమితమైంది. అంతకు ముందు న్యూజిలాండ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 174 పరుగులు చేసింది. అందుకు సమాధానంగా శ్రీలంక 20 ఓవర్లలో 6 వికెట్లకు సరిగ్గా 174 పరుగులే సాధించింది. చివరి బంతికి ఒక పరుగు చేయాల్సిన స్థితిలో తిరిమానే దురదృష్టవశాత్తు రనౌట్ కావడంతో మ్యాచ్ ‘టై’గా ముగిసింది. అనంతరం ఫలితాన్ని సూపర్ ఓవర్ ద్వారా తేల్చారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్‌కు ఓపెనర్లు రాబ్ నికొల్, మార్టిన్ గుప్టిల్ చక్కటి ఆరంభాన్నిచ్చారు. తొలి వికెట్‌కు 57 పరుగులు జోడించిన తర్వాత అఖిల ధనంజయ పెరెరా బౌలింగ్‌లో తిసర పెరీరా క్యాచ్ అందుకోగా గుప్టిల్ (38) అవుటయ్యాడు. స్టార్ బ్యాట్స్‌మన్ బ్రెండన్ మెక్‌కలమ్ 25 పరుగులకే అజంత మేండిస్ బౌలింగ్‌లో వెనుదిరగ్గా, 58 పరుగులు చేసిన నికోల్ వికెట్‌ను ధనంజయ పెరెరా కూల్చాడు. తిరుమానే క్యాచ్ పట్టగా నికొల్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. కెప్టెన్ రాస్ టేలర్ (25) తప్ప మిగతా బ్యాట్స్‌మెన్ లంక బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కోలేకపోయారు. ఫలితంగా 20 ఓవర్లలో న్యూజిలాండ్ ఏడు వికెట్లకు 174 పరుగులు చేయగలిగింది. కెరీర్‌లో తొలిసారి టి-20 ప్రపంచకప్ చాంపియన్‌షిప్‌లో ఆడుతున్న 18 ఏళ్ల ధనంజయ పెరెరా 32 పరుగులకు రెండు వికెట్లు పడగొట్టడం విశేషం.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన లంకకు ఓపెనర్లు మహేల జయవర్ధనే (కెప్టెన్), తిలకరత్నే దిల్షాన్ అద్భుత ఆరంభాన్నిచ్చారు. జయవర్ధనే 26 బంతుల్లో మూడు ఫోర్లు, మరో మూడు సిక్సర్లతో 44 పరుగులు చేసి జాకబ్ ఓరమ్ బౌలింగ్‌లో వెటోరీకి చిక్కాడు. కుమార సంగక్కర 21, జీవన్ మేండిస్ 8 అంతగా రాణించలేకపోయారు. దిల్షాన్ 53 బంతులు ఎదుర్కొని ఐదు ఫోర్లు, మూడు సిక్సర్లతో 76 పరుగులు చేసి దురదృష్టవశాత్తు రనౌటయ్యాడు. తిసర పెరీరా ఐదు పరుగులకు వెనుదిరగ్గా, చివరి ఓవర్ ఉత్కంఠను రేపింది. ఆ ఓవర్‌లో ఐదు బంతులు ముగిసే సమయానికి లంక 174 పరుగులు చేసింది. చివరి బంతికి ఒక పరుగు చేయాల్సి ఉండగా తిరిమానే రన్ కోసం విఫలయత్నం చేశాడు. అతను డైవ్ చేసి సకాలంలో క్రీజ్‌లోకి చేరుకోవడానికి ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. రెండు జట్లూ 174 పరుగులు చొప్పున చేయడంతో మ్యాచ్ ‘టై’గా ముగిసింది. అనంతరం సూపర్‌కు శ్రీలంక తరఫున జయవర్ధనే, తిసర పెరెరా బ్యాటింగ్‌కు దిగారు. టిమ్ సౌథీ వేసిన ఆ ఓవర్‌లో జయవర్ధనే నాలుగో బంతికి రనౌట్‌కాగా, లంక మొత్తం 13 పరుగులు చేసింది. 14 పరుగుల విజయలక్ష్యంతో కివీస్ బ్యాటింగ్‌కు దిగింది. బ్రెండన్ మెక్‌కలమ్, మార్టిన్ గుప్టిల్ బ్యాటింగ్ ఆరంభించారు. లసిత్ మలింగ వేసిన ఆ ఓవర్‌లో మొదటి నాలుగు బంతుల్లో మొత్తం మీద ఆరు పరుగులు లభించాయి. ఐదో బంతికి గుప్టిల్ అవుటయ్యాడు. చివరి బంతిలో ఒక్క పరుగు కూడా లభించలేదు. కివీస్ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేసిన మలింగ తన జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు.
న్యూజిలాండ్‌తో మ్యాచ్ ‘టై’శసూపర్ ఓవర్‌లో గెలుపు
english title:
s
Date:
Friday, September 28, 2012