Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

పోరాడి ఓడిన ఇంగ్లాండ్

$
0
0

పల్లేకల్, సెప్టెంబర్ 27: వెస్టిండీస్‌తో గురువారం జరిగిన టి-20 ప్రపంచ కప్ చాంపియన్‌షిప్ సూ పర్ ఎయట్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై వెస్టిండీస్ 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. 180 ప రుగుల లక్ష్యాన్ని అందుకోవడానికి బ్యాటింగ్ ఆ రంభించి, మొదటి ఓవర్‌లోనే రెండు వికెట్లు కోల్పోయనప్పటికీ ఇంగ్లాండ్ అద్భుత పోరాట పటిమను కనబరచింది. హాలెస్, మోర్గాన్ చివరి క్షణం వరకూ ఇంగ్లాండ్‌ను గెలిపించడానికి నానా తంటాలు పడ్డారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విండీస్‌కు ఓపెనర్లు జాన్సన్ చార్లెస్, క్రిస్ గేల్ చక్కటి ఆరం భాన్నిచ్చారు. ఇంగ్లాండ్ బౌలింగ్‌ను ఏమాత్రం లక్ష్యపెట్టకుండా పరుగుల వరద సృష్టించారు. తొలి వికెట్‌కు 103 జోడించిన తర్వాత గేల్ అవుట య్యాడు. అతను 35 బంతులు ఎదుర్కొని, ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 58 పరుగులు సాధించా డు. సామ్యూల్స్ (2), పొలార్డ్ (1) తక్కువ పరుగు లకే పెవిలియన్ చేరగా, ధాటిగా ఆడిన చార్లెస్ 56 బంతులు ఎదుర్కొని 10 ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 84 పరుగులు చేసి వెనుదిరిగాడు. కెప్టె న్ సమీ నాలుగు పరుగులకే అవుటయ్యాడు. విండీస్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 179 పరు గులు చేసింది. అప్పటికి డారెన్ బ్రేవో 10, రసెల్ 10 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.
విజయానికి 180 పరుగులు చేయాల్సిన ఇం గ్లాండ్ మొదటి ఓవర్‌లోనే రెండు వికెట్లు చేజార్చు కుంది. రవి రాంపాల్ వేసిన ఆ ఓవర్‌లో కీస్వెటర్, ల్యూక్ రైట్ పరుగుల ఖాతాను తెరవకుండానే పె విలియన్ చేరారు. ఈ దశలో జట్టును ఆదుకునే బాధ్యతను జానీ బెయర్‌స్టో, అలెక్స్ హాలెస్ స్వీక రించారు. వీరిద్దరూ వికెట్ల పతనాన్ని నిలువరించ గలిగారేగానీ, వేగంగా పరుగులు రాబట్టలేకపో యారు. 10 ఓవర్లలో 55 పరుగులు జోడించిన తర్వాత బెయర్‌స్టో (18) అవుట్‌కావడంతో ఈ భా గస్వామ్యానికి తెరపడింది. గేల్‌కు బెయర్‌స్టో వికె ట్ లభించడం విశేషం. థర్డ్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన ఇయాన్ మోర్గాన్ చెలరేగిపోయాడు. హాలె స్ కూడా అతనికి జత కలిశాడు. వీరిద్దరూ నాలు గో వికెట్‌కు 107 పరుగులు జోడించారు. హాలెస్ 5 ఫోర్లు, రెండు సిక్సర్లతో 68 పరుగులు చేసి అవు ట్‌కాగా, మోర్గాన్ కేవలం 36 బంతుల్లోనే అజే యంగా 71 పరుగులు చేశాడు. ఇంగ్లాండ్ 20 ఓ వర్లలో నాలుగు వికెట్లకు 164 పరుగులు చేసి, 15 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

వెస్టిండీస్‌తో గురువారం జరిగిన టి-20 ప్రపంచ కప్ చాంపియన్‌షిప్
english title: 
p

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles