Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

పరిశ్రమలు, సంస్థల నిబంధనలు

$
0
0

కొత్తగూడెం, అక్టోబర్ 10: పరిశ్రమల ఏర్పాటు, భూగర్భవనరులను వెలికి తీయడం వలన నిర్వాసితులయ్యే గిరిజనులకు న్యాయం చేసేందుకు రూపొందించిన నిబంధనలను పాటించాల్సిర బాధ్యత ఆయా పరిశ్రమలు, సంస్థలపై ఉందని రాష్ట్ర శాసనసభ గిరిజన సంక్షేమ కమిటీ చైర్మన్ పీడిక రాజన్న దొర స్పష్టం చేశారు. స్థానిక సింగరేణి అతిధి గృహంలో బుధవారం గిరిజన ఉద్యోగ సంఘాలు, సింగరేణి అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మొదట ఉద్యోగ సంఘాలు, ఉద్యోగుల నుండి వినతిపత్రాలు స్వీకరించిన అనంతరం ఆయన ప్రసంగించారు. వృత్తిపరంగా గిరిజన ఉద్యోగుల సమస్యలను కమిటీ అవగాహన చేసుకుందని తెలిపారు. గిరిజనులకు న్యాయం చేసేందుకు రూపొందించిన చట్టాలను వినియోగించుకునే పరిస్థితిని తీసుకురావద్దని సింగరేణి అధికారులకు సూచించారు. పారిశ్రామికీరణ వలన ఏజెన్సీలోనే గిరిజనులు భూములు, ఇళ్లను కోల్పోతున్నారని పేర్కొన్నారు. అడవులు దెబ్బతిని జీవనాధారం లేకుండా పోతుందని, కాలుష్యం బారినపడి అనారోగ్యానికి గురౌతున్నారని అన్నారు. ఈసమస్యలను గుర్తించిన ప్రభుత్వం గిరిజనుల సంక్షేమానికి ఆర్ అండ్ ఆర్ రూపొందించిందని సామాజిక బాధ్యతగా లాభాలలో నిర్ధిష్టమైన శాతాన్ని గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ఖర్చు చేయాలని చెప్పారు. ఈవిషయంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకు గిరిజన యువతకు సాంకేతిక నైపుణ్యం కలిగించేందుకు అవసరమైన శిక్షణను నిర్వహించేందుకు చొరవ తీసుకోవాలని కోరారు. 67వేల మంది ఉద్యోగులు ఉన్న సింగరేణి సంస్థలో 5శాతంలోపే గిరిజనులు ఉండడం బాధాకరమన్నారు. అన్ని స్థాయిల్లో గిరిజనులకు సరైన ప్రాతినిధ్యం కల్పించేందుకు రూల్ ఆఫ్ రిజర్వేషన్‌ను ఖచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన గిరిజన సాధికారిక అమలుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తద్వారా గిరిజనుల సంక్షేమానికి ప్రస్తుతం సంస్థలో అమలుచేస్తున్న నిబంధనలను అవసరమైతే సవరించుకోవాలని చైర్మన్ రాజన్న దొర సూచించారు. ఈకార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సిద్ధార్థజైన్, శాసనసభాకమిటీ సభ్యులు ఎన్ సుగ్రీవులు, వి మిత్రసేన, డి అనసూయ, బానోత్ చంద్రావతి, సత్యవతి రాథోడ్, పి మురళీకృష్ణ, ఊకె అబ్బయ్య, రేగా కాంతారావు, కుంజా సత్యవతి, స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, జాయింట్ కలెక్టర్ ఎంఎం నాయక్, సింగరేణి డైరెక్టర్ (పా) విజయ్‌కుమార్, జిఎం పర్సనల్ ఇవి పురుషోత్తం, సిజిఎం చంద్రుడు, భద్రాచలం ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి వీర పాండ్యన్ తదితరులు పాల్గొన్నారు.
సాగునీటి ప్రాజెక్టుల సాధనే
సిపిఎం లక్ష్యం
ఆజిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శన్
దుమ్ముగూడెం, అక్టోబర్ 10: ఖమ్మం జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల సాధన కోసం సిపిఎం పార్టీ నిరంతరం పోరాటాలు చేస్తుందని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శన్ అన్నారు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 28 నుంచి 13 రోజుల పాటు సాగునీటి సాధన మహారైతు యాత్ర సందర్భంగా బుధవారం దుమ్ముగూడెం గోదావరి వద్దకు మోటారుసైకిల్ ర్యాలీ ద్వారా చేరుకున్నారు. ఈ సందర్భంగా దుమ్ముగూడెం వద్ద సర్ ఆర్థర్ కాటన్ దొర నిర్మించిన ఆనకట్టను సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు నుంచి 15వ తేదీ వరకు సాగునీటి ప్రాజెక్టుల పరిశీలన యాత్ర ఉంటుందని తెలిపారు. జిల్లాలోని 12 లక్షల ఎకరాల భూమి ఉంటే కేవలం మూడున్నర లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతుందని, పాలకుల నిర్లక్ష్యమే కారణమని దుయ్యబట్టారు. జిల్లాపై పాలకులు సవతితల్లి ప్రేమ చూపుతున్నారని విమర్శించారు. జిల్లాలో అనేక నీటి ప్రాజెక్టులకు అనువుగా ఉన్నా పట్టించుకోవడం లేదని వాపోయారు. దుమ్ముగూడెం గోదావరి నది వద్ద లిఫ్టు ఇరిగేషన్ ఏర్పాటు చేసి ఏజెన్సీలోని దుమ్ముగూడెం, భద్రాచలం మండలాలకు వెంటనే సాగునీరందించాలని కోరారు. గిరిజనులను ముంచే పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హాదా కల్పించేందుకు చేస్తున్న ప్రయత్నాలు విరమించుకొని గిరిజనులకు లబ్ధిచేకూర్చే దుమ్ముగూడెం నిర్మించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మచ్చా వెంకటేశ్వర్లు, ఏజె రమేష్, కాసాని ఐలయ్య, సున్నం రాజయ్య, వై రవికుమార్, నున్నా నాగేశ్వరరావు, కుంజా బొజ్జి, సరియం కోటేశ్వరరావు, మర్మం చంద్రయ్య, కొర్సా చిలకమ్మ, కొమరం దామోదర్రావు, సీహెచ్ మిత్రా, సరియం రాజమ్మ తదితరులు పాల్గొన్నారు.

కుంభకోణాల్లో కూరుకుపోయిన
ప్రభుత్వాలు
* పువ్వాడ నాగేశ్వరరావు విమర్శ
ఖమ్మం (మామిళ్ళగూడెం), అక్టోబర్ 10: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవినీతి, కుంభకోణాలలో కూరుకుపోయాయని సిపిఐ జాతీయ నాయకుడు పువ్వాడ నాగేశ్వరరావు ఆరోపించారు. వీధివీధిగా సిపిఐ కార్యక్రమంలో భాగంగా బుధవారం ఆయన కబేళా, మాణిక్యనగర్ ప్రాంతాలలో పర్యటించారు. ఆప్రాంతాలలో ఉన్న అపరిశుభ్రతను పరిశీలించి ప్రభుత్వ విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వరుస కుంభకోణాలలో కేంద్ర ప్రభుత్వం కూరుకుపోయిందని, తాజాగా సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా కూడా అందులో చేరిపోయాడన్నారు. రాష్ట్రంలో కూడా మైనింగ్, వాన్‌పిక్ కుంభకోణాలలో కూరుకుపోయి అభివృద్ధికి కూడా డబ్బులు లేవనే పరిస్థితికి వచ్చిందన్నారు. ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే దుమ్ముగూడెం ప్రాజెక్టు పనులను వెంటనే ప్రారంభించాలని, నిర్వాసితులకు ఎక్స్‌గ్రేషియా పెంచాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సాధన కోసం సిపిఐ నిరంతర పోరాటాలు చేస్తుందన్నారు. ఈసందర్భంగా ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు జానిమియా, క్లైమెట్, సలాం, సూరిబాబు, నాగేశ్వరరావు, సైదా తదితరులు పాల్గొన్నారు.
నాకు ప్రాణహాని ఉంది : స్వాతి
కారేపల్లి, అక్టోబర్ 10: అత్తింటి వారు నన్ను చంపటానికి అనేక ప్రయత్నాలు చేశారు. ఇక భర్త రాజ్‌కుమార్, అతని కుటుంబ సభ్యులతో వేగలేక న్యాయ పోరాటానికి దిగాను అంటూ అత్తింటి వారి వేధింపులపై న్యాయపోరాటం చేస్తున్నట్లు అరకాల స్వాతి తెలిపింది. స్వాతి అత్తవారింటి ముందు చేస్తున్న న్యాయపోరాటం బుధవారానికి నాల్గవ రోజుకు చేరుకుంది. బుధవారం వౌనదీక్షా శిబిరాన్ని సందర్శించి స్వాతిని ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం నాయకులు పరామర్శించారు. అనంతరం పౌరహక్కుల సంఘం రాష్ట్ర నాయకులు తిరుమలరావు, ఆర్ పావెల్, విప్లవకుమార్‌లు విలేఖరులతో మాట్లాడుతూ కారేపల్లిలో అత్తింటి వారి వేధింపులపై న్యాయపోరాటం చేస్తున్న స్వాతి వైపు కనీసం అధికారులెవరూ కనె్నత్తి చూడకపోవటం బాధాకరమన్నారు. పెళ్ళికి ముందు డాక్టర్‌గా చెప్పి మోసం చేసిన అత్తమామలపై కేసులు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు. స్వాతి చేస్తున్న న్యాయ పోరాటానికి న్యూడెమోక్రసీ నాయకులు గండి యాదగిరి, వై ప్రకాష్, వై జానకి, ఎట్టి సరోజ, సిపిఎం నాయకులు కె నాగేశ్వర్‌రావు, తలారి దేవప్రకాష్, మెరుగు రమణ, కె ఉమావతి, సత్యవతి, కవిత, సుభధ్రలు తమ సంఘీభావం ప్రకటించారు.
మాయమైపోతున్న మానవ సంబంధాలు
రేపల్లి, అక్టోబర్ 10: పిల్లవాని మానసిక స్థితిని బట్టే విద్యాబోధన జరగాలని, కాని నేడు మానవ సంబంధాలు మాయమై పోతున్నాయని ప్రముఖ విద్యావేత్త, కాకతీయ యూనివర్సిటీ మాజీ పాలకవర్గ సభ్యులు మువ్వా శ్రీనివాస రావు అన్నారు. బుధవారం కారేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన కారేపల్లి కబుర్లు పుస్తకావిష్కరణ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రముఖ కవి సీతారం రాసిన ఈ పుస్తకాన్ని ప్రముఖ సినీ రచయిత (శ్రీరాములయ్య) ఖాదర్‌మోహినుద్దీన్ అవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రముఖ జర్నలిస్ట్ ప్రసేన్ అధ్యక్షతన జరిగిన సభలో మువ్వా మాట్లాడుతూ విద్యార్థులకు ప్రశ్నించే తత్వాన్ని అధ్యాపకులు బోధించాలన్నారు. గతంలో కారేపల్లి జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రశ్నించటం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కళాశాలల్లో బాలికలకు మరుగుదొడ్ల నిర్మాణం జరిగిందన్నారు. నేడు విద్యావ్యవస్థ దయనీయస్థితిలో ఉందని ఫీజు రీయంబర్స్‌మెంట్ మూలంగా ప్రభుత్వ కళాశాలలు కనుమరుగయ్యే పరిస్థితుల్లోకి నెట్టబడిందన్నారు. సినీ రచయిత ఖాదర్‌మోహినుద్దీన్ మాట్లాడుతూ నేడు మానవ సంబంధాలు మాయమై పోతున్నాయని, యాంత్రీకరణగా మారిపోతుందన్నారు. సమాజ అధ్యయనం కోసం తనకెదురైన అనుభవాలను సీతారాం పుస్తక రూపంలోకి తీసుకరావటం హర్షించదగిన విషయమన్నారు. ఈ కార్యక్రమంలో పుస్తక రచయిత సీతారాం, జిల్లా ప్రభుత్వ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు కె ఎస్ రామారావు, జిల్లా ప్రైవేటు కళాశాలల సంఘం అధ్యక్షుడు వీరారెడ్డి, వాసిరెడ్డి శ్రీనివాసరావు, కళాశాల ప్రిన్సిపాల్ డివిఎస్ ప్రభాకర్ రావు, నాయకుడు మణికుమార్ పాల్గొన్నారు.

ఇసుకను అధిక ధరలకు విక్రయిస్తే
కఠిన చర్యలు
ప గనుల శాఖ మంత్రి గల్లా అరుణకుమారి
ఆంధ్రభూమి బ్యూరో
గుంటూరు, అక్టోబర్ 10: ప్రభు త్వం నిర్ణయించిన ధరకే ఇసుకను విక్రయించాలని, ఇష్టానుసారం వ్యవహరిస్తే లైసెన్స్‌లు రద్దు చేయడంతో పాటు, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర గనుల శాఖ మంత్రి గల్లా అరుణకుమారి హెచ్చరించారు. బుధవారం గుంటూరుకు వచ్చిన సందర్భంగా ఆమె జిల్లా అధికారులతో పరిస్థితిని సమీక్షించారు. అనంతరం విలేఖర్లతో మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం ఇసుకపై తీసుకున్న నిర్ణయాన్ని మొట్టమొదటగా గుంటూరు జిల్లాలోనే అమలు చేసిందని తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు ఇందిరమ్మ గృహాల కోసం 1.20 లక్షల క్యూబిక్ మీటర్లు, ప్రభుత్వ అవసరాలకు లక్ష క్యూబిక్ మీటర్ల ఇసుకను విడుదల చేసినట్లు చెప్పారు. అన్ని రీచ్‌లలో ప్రభుత్వం నిర్ణయించిన ధరకే ఇసుక విక్రయించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇసుకను నిత్యావసర వస్తువుగా గుర్తించేందుకు రాష్ట్రప్రభుత్వం ఆలోచిస్తుందని పేర్కొన్నారు. ఇసుక మైనింగ్ ఉదయం 6 నుండి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే తవ్వకాలు జరిపేలా ఆదేశాలు జారీ చేశామని, ఇందుకు విరుద్ధంగా రాత్రివేళల్లో మైనింగ్ నిర్వహించినట్లు సమాచారం అందితే వెంటనే దాడులు నిర్వహించాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు.
సిఎం పర్యటనతో రహదారులను జల్లెడపట్టిన పోలీసులు
నూజెండ్ల, అక్టోబర్ 10: ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్‌రెడ్డి ఇందిరమ్మబాటలో భాగంగా మండలంలో బుధవారం పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా రూరల్ ఎస్పీ జె సత్యనారాయణ పర్యవేక్షణలో ఇద్దరు డిఎస్పీలు, ఐదు మంది సిఐలు, 12 మంది ఎస్సైలు, 200 మంది సిబ్బందితో చింతలచెర్వు, ఐనవోలు, చీకటీగలపాలెం అడ్డరోడ్టువరకు రహదారి మార్గంలో జల్లెడ పట్టారు. అడుగడుక్కి బదోబస్తుని ఏర్పాటు చేశారు. ప్రకాశం జిల్లా దర్శి నుండి సిఎం బయలు దేరి గుంటూరు జిల్లా సరిహద్దు ప్రాంతమైన చింతలచెర్వుకు సిఎం కాన్వాయ్ చేరుకొని, ఐనవోలు, చీకటీగలపాలెం అడ్డరోడ్డు మీదుగా ప్రకాశం జిల్లా మేడపి వైపు వెళ్లింది. సిఎం ప్రయాణిస్తున్న ప్రత్యేక బస్సు నుండి కిరణ్ కుమార్‌రెడ్డి ప్రజలకు చేతులు ఊపుతూ అభివాదం చేశారు. ముఖ్యమంత్రి పర్యటన సజావుగా సాగడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. సిఎం పర్యటనతో అధ్వానంగా మారిన కురిచేడు రహదారి బాగుపడటంటతో ఆ ప్రాంత వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
బాధిత మిర్చి రైతులకు
11.65 కోట్లు విడుదల
ప కలెక్టర్ సురేష్‌కుమార్ వెల్లడి
ఆంధ్రభూమి బ్యూరో
గుంటూరు, అక్టోబర్ 10: జిల్లాలో గత ఏడాది జరిగిన కోల్డ్‌స్టోరేజ్ అగ్నిప్రమాద బాధిత రైతులకు ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి 11,65,30,000 రూపాయలు విడుదల చేసినట్లు జిల్లా కలెక్టర్ ఎస్ సురేష్‌కుమార్ పేర్కొన్నారు. కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో బుధవారం నాడు 2011లో శ్రీ సాయిసూర్య కోల్డ్‌స్టోరేజ్‌లో సంభవించిన అగ్నిప్రమాదానికి సంబంధించి ఇన్సూరెన్స్ విడుదలపై కలెక్టర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ సురేష్‌కుమార్ మాట్లాడుతూ ఇన్సూరెన్స్ పొందిన మిర్చి బస్తాల వివరాలను తెలియజేస్తూ మేలురకం మిర్చి 32,598 బస్తాలు, తాలుగాయలకు సంబంధించి 5,096 బస్తాలకు ఇన్సూరెన్స్ చెల్లించడం జరుగుతుందని తెలిపారు. సంబంధిత ఇన్సూరెన్స్ మొత్తాన్ని రైతులకు చెల్లించే విధంగా కోల్డ్‌స్టోరేజ్ పేరిట బ్యాంకులో జమ చేయాలని ఇన్సూరెన్స్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎన్ యువరాజ్, రైతు ప్రతినిధులు, సాయిసూర్య, నందిని, వెంగమాంబ కోల్డ్‌స్టోరేజ్‌ల యజమానులు తదితరులు పాల్గొన్నారు.

చైతన్య కెరటం అమరజీవి మల్లయ్యలింగం
ప సిపిఐ జిల్లా కార్యదర్శి ముప్పాళ్ల నివాళి
గుంటూరు (కొత్తపేట), అక్టోబర్ 10: అభ్యుదయ భావజాళాన్ని నరనరాల్లో నింపుకున్న అమరజీవి మల్లయ్యలింగం చైతన్య కెరటమని సిపిఐ జిల్లా కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు కొనియాడారు. బుధవారం కొత్తపేటలోని సిపిఐ కార్యాలయంలో మల్లయ్యలింగం 40వ వర్ధంతి సభ జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ శ్రమజీవుల కోసం పోరాటం చేస్తున్న ప్రతిఒక్కరికీ మల్లయ్యలింగం స్ఫూర్తిదాయకమన్నారు. ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన మల్లయ్యలింగం ఆశయ సాధనకు కార్యకర్తలంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు. నగర కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్ మాట్లాడుతూ అలుపెరగని పోరాట స్ఫూర్తికి మల్లయ్యలింగం ప్రత్యక్ష నిదర్శనమన్నారు. అనంతరం మల్లయ్యలింగంతో సహచరునిగా పనిచేసిన పి భీమారావును సిపిఐ నగర సమితి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ నాయకుడు జివి కృష్ణారావు, ప్రజానాట్య మండలి రాష్ట్ర గౌరవాధ్యక్షులు కొల్లి సాంబశివరావు, కా ర్యదర్శి గని, ఎఐటియుసి నగర కార్యదర్శి జి సురేష్, నగర కమిటీ నాయకు లు అమీర్‌వలి, పిచ్చయ్య, మంగమ్మ, శ్రీనురెడ్డి, ఎంజె మోహనరావు, చల్లా చిన ఆంజనేయులు పాల్గొన్నారు.

చేపల చెరువుల వేలంను అడ్డుకున్న రైతాంగం
సత్తెనపల్లి, అక్టోబర్ 10: మండలంలోని వివిధ గ్రామాల్లో చేపల చెరువులు వేలం పాట నిర్వహించబోయిన అధికారులకు బుధవారం చుక్కెదురైంది. ఆయా చెరువుల కింద సాగునీటికి ఉపయోగించుకుంటున్న నేపథ్యంలో హఠాత్తుగా చేపల చెరువులకు వేలం పాటలు నిర్వహిస్తే తాము తీవ్రంగా నష్టపోతారని ఆయా గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలోని ధూళిపాళ్లలోని చెరువు కింద దాదాపు 300 ఎకరాలు సాగవుతోందని, పన్నులంటూ పరిగెత్తుకొచ్చే పంట పండటానికి సహకరించాలని కోరారు. అలాగే మండలంలోని నందిగంలో కూడా రైతాంగం అధికారులకు ఎదురు తిరిగింది. గత్యంతరం లేని స్థితిలో అధికారులు పోలీసుల సహాయాన్ని కోరినా రైతుల ఆగ్రహంతో వేలం నిలిపి వేయాల్సి వచ్చింది. ఈ కార్యక్రమ నిర్వహణలో మండల తహశీల్దార్ గందం రవీంధర్, ఇఒఆర్‌డి లిల్లి పుష్పం, ఇఒ సుబ్బారెడ్డి, ఆయా గ్రామాల పంచాయతీ అధికారులు పాల్గొన్నారు.

గిరిజనులకు న్యాయం చేసేలా ఉండాలి
english title: 
par

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>