చిత్తూరు, అక్టోబర్ 10: నేరాల అదుపునకు పోలీసు అధికారులు చర్యలు చేపట్టాలని అనంతపురం రేంజ్ డిఐజి చారుసిన్హా పిలుపునిచ్చారు. బుధవారం చిత్తూరు పోలీసు క్లబ్‌లో నెలవారి పోలీసు అధికారుల సమావేశం జిల్లా ఎస్పీకాంతిరాణాటాటా అధ్యక్షతన నిర్వహించారు. ఈసమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డిఐజి చారుసిన్హా మాట్లాడుతూ చిత్తూరు జిల్లా రాష్ట్రంలోనే కడపటి జిల్లా, నాలుగు రాష్ట్రాల కూడలిలో ఉన్న జిల్లా అన్నారు. ఇక్కడ నేరాలు, దొంగతనాలు అధికంగానే జరుగుతుంటాయని వాటిని నివారించేందుకు పోలీసు అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలన్నారు. పెండింగ్‌లో ఉన్న కేసులు చేదించడంలోను, నేరస్థులను పట్టుకొని బాధితుల సొమ్మును అప్పగించే పనిలో అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. దీంతోపాటు జిల్లాలోని సర్కిల్ పరిధిలో ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉన్న కేసులు, అరెస్టులు తదితరాలపై క్షుణ్ణంగా సమీక్షించారు. ఈకార్యక్రమంలో ఎఎస్పీ అన్నపూర్ణారెడ్డి, డిఎస్పీలు, సిఐలు తదితరులు ఉన్నారు.
కాణిపాకం బ్రహ్మోత్సవాలు విజయవంతం
* అధికారులకు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపిన ఇఓ
తవణంపల్లె, అక్టోబర్ 10: కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు 21రోజుల పాటు విజయవంతంగా నిర్వహించినందుకు ఇఓ పూర్ణచంద్రరావు అధికారులకు, సిబ్బందికి పేరుపేరున కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం కాణిపాకం ఇఓ కార్యాలయంలో అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ప్రతి ఒక్కరిని అభినందించారు. డిఎస్పీ రాజేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో సిఐ శ్రీకాంత్, ఎస్సై శ్రీనివాసులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. అదే విధంగా గత ఐదేళ్లుగా గణేష్ మాల ధరించి ఎందరికో మార్గదర్శుకులైన సిద్దిపేటకు చెందిన గురుస్వామి, మొరంశెట్టిరాములును ఈసందర్భంగా దుశ్శాలువతో అభినందించారు. ఐదేళ్ల క్రితం తొలిసారిగా గణేష్ మాలాధారణను ఈయనే ప్రవేశపెట్టారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా జరిగిన బ్రహ్మోత్సవాల కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికీ పేరుపేరున అభినందనలతో పాటు దుశ్చాలువలతో సత్కరించారు. ప్రత్యేకంగా మీడియా వారికి కృతజ్ఞతలు తెలిపారు.
వృద్ధుల సంక్షేమానికి ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలి
* మంద కృష్ణమాదిగ డిమాండ్
మదనపల్లె, అక్టోబర్ 10: వృద్ధుల సంక్షేమం కోసం కేంద్రం నుంచి వస్తున్న నిధులలో సుమారు వెయ్యి కోట్ల రూపాయలు రాష్ట్రంలో దుర్వినియోగం అవుతున్నాయని, ఈ నిధులు పక్కదారి పట్టకుండా వృద్ధుల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్రాల్లో మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మంద కృష్ణమాదిగ డిమాండ్ చేశారు. బుధవారం ఆర్‌అండ్‌బి అతిథిగృహంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 65నుంచి 80ఏళ్ళ లోపు వృద్ధులకు కేంద్రం రూ.225 వంతున రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లిస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.200 కలుపుకుని రూ.425 పింఛన్ చెల్లించాల్సి ఉండగా 2004 అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నేటి వరకు వృద్ధులకు, వితంతువులకు రూ.200 మాత్రమే చెల్లిస్తున్నారని పేర్కొన్నారు. అదే విధంగా 80ఏళ్ళు పైబడిన వృద్ధులకు రూ.500 పింఛన్ చెల్లించాలని 2011 జూన్ 30న కేంద్రప్రభుత్వం జీఓ విడుదల చేసి నిధులు కేటాయించిందని తెలిపారు. దీంతో పాటు గతంలో 65ఏళ్ళు పైబడిన వృద్ధులకు మాత్రమే వృద్ధాప్య పింఛన్ మంజూరయ్యేదని, కేంద్ర ప్రభుత్వం 6మాసాల క్రితం 60ఏళ్ళకే వృద్ధాప్య పింఛన్ మంజూరు చేయాలని జీఓ విడుదల చేసి నిధులు సైతం విడుదల చేస్తోందని వివరించారు. ఈ లెక్కల దామాషప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న పింఛన్ కేవలం కేంద్ర నిధులతో సరిపెడుతున్నారన్నారు. వృద్ధుల మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయాలని, ఇందులో సీనియర్ సిటిజన్‌లు ప్రభుత్వ, ప్రజాసేవా సంక్షేమాలలో అనుభవం గడించిన వారికి రాష్టప్రతి కోటాలో రాజ్యసభ, గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపికచేసి వారికి మంత్రిత్వశాఖ కేటాయించాలని డిమాండ్ చేశారు. వితంతువులు, వృద్ధులకు నెలకు రూ.1000 పింఛన్ ఇవ్వాలని కోరారు. జిల్లాకు ఒక వృద్ధాశ్రమం ఏర్పాటు చేయాలన్నారు. వృద్ధులు, వితంతువుల హక్కుల సాధనకై యాత్రలు చేస్తు నవంబర్ 27న హైదరాబాదు నిజాం కళాశాల గ్రౌండ్‌లో లక్షలాదిమందితో జనసభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్ రాయలసీమ కన్వీనర్ పిటిఎం శివప్రసాద్, జిల్లాఅధ్యక్షులు నరేంద్రబాబు, శ్రీనివాస్, శ్రీచందు, విహెచ్‌పిఎస్ నాయుడు, వౌలాలి, ప్రభాకర్, వాయిస్ కరీముల్లా పాల్గొన్నారు.
బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించడానికి సహకరించండి
* మీడియాకు టిటిడి చైర్మన్ బాపిరాజు విజ్ఞప్తి
తిరుపతి, అక్టోబర్ 10: శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు మీడియా సహకారం అందించాలని టిటిడి చైర్మన్ కనుమూరి బాపిరాజు విజ్ఞప్తి చేశారు. బుధవారం పాలక మండలి సమావేశం ముగిసిన అనంతరం తిరుమల అన్నమయ్య భవన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ శ్రీవారి సాలకట్లబ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించామన్నారు. అదే తరహాలో నవరాత్రి బ్రహ్మోత్సవాలను కూడా విజయవంతంగా నిర్వహిస్తామన్నారు. ఇఓ ఎల్వీ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ 12 డిస్‌ప్లే స్క్రీన్ల ద్వారా భక్తులకు స్వామివారి వాహన సేవలను చూపించనున్నట్లు తెలిపారు. మాడావీధుల్లో పలు చోట్ల సాంప్రదాయ దుస్తుల్లో వచ్చే వారిని 10 నుండి 15వేల మందిని ఒకేచోట చేర్చి స్వామివారికి హారతులు పలికేవిధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. తద్వారా సుమారు 50 వేల మంది భక్తులకు హారతులు పలికేందుకు అవకాశం ఉంటుందన్నారు. వాహన సేవల్లో 73 సార్లు వాహనాలను అటు ఇటూగా తిప్పినట్లు చెప్పారు. ఈ పరిస్థితుల నేపధ్యంలో మూడు జంక్షన్లను ఏర్పాటు చేసి అక్కడ కొంత సమయం భక్తులకోసం హారతులు పలికే ఏర్పాట్లు చేయిస్తున్నట్లు తెలిపారు. ఈ పర్యాయం స్వామివారి ఉత్సవాలకు ధ్వజారోహణం, ధ్వజావరోహణం ఉండవన్నారు. అలాగే పెద్దరథం ఊరేగింపు ఉండదన్నారు. ఈ పర్యాయం స్వామివారు వేటకు వెళ్లే పార్వేటి ఉత్సవం ఉంటుందన్నారు.
జగన్‌కు బెయిల్ రాకుండా టిడిపి, కాంగ్రెస్ కుట్ర
* వైఎస్సార్‌సిపి జిల్లా కన్వీనర్ ఆరోపణ
మదనపల్లె, అక్టోబర్ 10: దివంగత సిఎం వైఎస్సార్ తనయుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 5న విడుదల అవుతారని ఎంతో ఆశలతో ఎదురుచూసిన ప్రజలకు నిరాశ ఎదురైందని, ఇందుకు తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ కలిసి కుట్ర పన్నడంతో బెయిల్ నిలిపివేశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ నారాయణస్వామి పేర్కొన్నారు. బుధవారం తంబళ్ళపల్లె నియోజకవర్గం పర్యటనకు వెళుతూ మార్గమధ్యలో వైఎస్సార్ యువజన జిల్లా అధ్యక్షులు ఉదయ్‌కుమార్ ఇంట్లో అల్పాహార విందుకు హాజరైన ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. జగన్ బెయిలు విషయంలో న్యాయస్థానం జాప్యం చేసినా మంచే జరుగుతుందని, టిడిపి ఎంపిలు ముందురోజు ప్రధానితో మాట్లాడటం కుట్రపూరితమే అని విమర్శించారు. ఆర్టీసీ చార్జీలు 15సార్లు పెంచడం మరిచిపోయి మరలా పాదయాత్ర చేస్తున్న చంద్రబాబు, చేసిన తప్పులు ప్రాయశ్చిత్తం చేసుకోవడానికే తప్ప రాబోవు ఎన్నికలలో టిడిపితో పాటు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ కోల్పోవడం ఖాయమని జోస్యం చెప్పారు. ఈ సమావేశంలో వైఎస్సార్ సిపి నాయకులు జగన్నాధరెడ్డి, భాస్కర్‌నాయుడు, కొండయ్య, శ్రీనివాసులు, రామచంద్ర, కత్తిక్రిష్ణమూర్తి, ఈశ్వర్, పవన్‌తేజ్, మల్లిక, వైజయంతి, సునంద తదితరులు ఉన్నారు.
ఈస్ట్ గోదావరి....
? ???? ??? ?????? ????? ??????????