ఐదుగురు అమ్మాయిల జీవితానికి సంబంధించి చిక్కుముడిలో భాగంగా, నలుగురమ్మాయిలు తమ జీవితంలో కొన్ని గంటలు మిస్సయితే, ఆ సమయంలో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నమే ఈ చిత్ర కథ అని, హత్యలు, దోపిడీలు వంటి కథనాలు ఈ చిత్రంలో వుండవని, ప్రేక్షకుడికి ప్రతి సన్నివేశం ఆసక్తికరంగా ఉంటుందని, దర్శకుడు చాచా తెలిపారు. ఫుల్‌మూన్ పిక్చర్స్ పతాకంపై పి.వి.నాగేష్‌కుమార్, రవి కె.పున్నం నిర్మించిన ఈ చిత్రం ‘మస్తీ.’ ఈ చిత్రానికి సంబంధించిన పాత్రికేయుల సమావేశం హైదరాబాద్‌లో నిర్వహించారు. నిర్మాత రవి కె.పున్నం మాట్లాడుతూ విజయ్‌కూరాకుల బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా వచ్చిందని, అమ్మాయిల మనస్తత్వాలు ఎలా వుంటాయి, వారి తల్లిదండ్రుల ఇబ్బందులు ఏమిటనే అంశంతో ఈ చిత్రం సాగుతుందని తెలిపారు. సుష్మా, దీక్షాపంత్, నాజియా, ఆదిల్, రేఖ, మధుబాల, చాణక్య, ప్రదీప్, ప్రేమ్, శక్తిమాన్, కాటంరెడ్డి, కోటేశ్వరరావు తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: గోపీనాథ్, నిర్మాతలు: పి.వి.నాగేష్‌కుమార్, రవి కె.పున్నం, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: చాచా.
ఐదుగురు అమ్మాయిల జీవితానికి సంబంధించి చిక్కుముడిలో
english title:
masti
Date:
Saturday, October 13, 2012