హైదరాబాద్, అక్టోబర్ 13: తెలంగాణ అంశంపై టిఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు తమ వైఖరి స్పష్టం చేయాలని టిడిపి శాసన సభాపక్షం ఉప నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు డిమాండ్ చేశారు. టిఆర్‌ఎస్, కాంగ్రెస్ ఈ రెండు పార్టీలు కూడా తెలంగాణపై తమ వైఖరి స్పష్టం చేయకుండా ఉద్యమకారులతో ఆటలాడుకుంటున్నారని విమర్శించారు. శనివారం ఎన్టీఆర్ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణపై కేంద్ర మంత్రులు ఒక్కోక్కరు ఒక్కో విధంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. యుపిఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ, ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ తెలంగాణపై తమ వైఖరి వెల్లడించాలని డిమాండ్ చేశారు. కేంద్రం కెసిఆర్‌తో జరిపిన చర్చలను బహిరంగ పరచాలని డిమాండ్ చేశారు. చర్చల పేరుతో ఢిల్లీ వెళ్లి సూట్‌కేసులు తెచ్చుకోవడం మినహా తెలంగాణ సాధన కోసం కెసిఆర్ చేస్తున్నదేమీ లేదన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి రాష్ట్రాన్ని మరణాంధ్రప్రదేశ్‌గా మారుస్తున్నారని టిడిపి శాసన సభాపక్షం ఉప నాయకుడు గాలి ముద్దు కృష్ణమనాయుడు విమర్శించారు.శనివారం ఎన్టీఆర్ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.
భరోసా కోసమే బాబు యాత్ర
సమస్యల్లో ఉన్న ప్రజలకు భరోసా ఇచ్చేందుకే చంద్రబాబు వస్తున్నా మీ కోసం పేరుతో పాదయాత్ర చేస్తున్నారని టిడిపి రాష్ట్ర కార్యదర్శి శోభారాణి తెలిపారు.
అఖిలపక్షం పెడితే టిడిపి ఓటు తెలంగాణకే: ఎర్రబెల్లి
తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ మోసం చేస్తోందని టిడిపి తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు విమర్శించారు. కేంద్రం వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రం అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తే టిడిపి తెలంగాణకు అనుకూలంగానే తన నిర్ణయాన్ని ప్రకటిస్తుందని తెలిపారు. పదవులకు ఆశ పడుతూ కాంగ్రెస్ మంత్రులు తెలంగాణ అంశాన్ని పక్కన పెట్టారని విమర్శించారు. కేంద్రానికి పది హేను రోజుల గడువు ఇచ్చి తెలంగాణ కోసం ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయకులు పదవుల కోసం ఆశ పడుతూ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. మంత్రులు, తెలంగాణ కాంగ్రెస్ ఎంపిలు రాజీనామా ద్వారా కాంగ్రెస్ హై కమాండ్‌పై ఒత్తిడి తీసుకు వచ్చి తెలంగాణ వచ్చేందుకు తోడ్పడాలని కోరారు. తెలంగాణకు కాంగ్రెస్ అడ్డంకిగా మారిందని అన్నారు. బాబు యాత్రను చూసి బెదిరిపోయిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ షర్మిలతో పాదయాత్ర చేయిస్తుందని విమర్శించారు. ఓట్ల కోసం జగన్ జైలులోనే ఉండాలని జగన్ కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారని శోభారాణి తెలిపారు.
తెలంగాణపై టిడిపి డిమాండ్
english title:
tdp demand
Date:
Sunday, October 14, 2012