నెల్లూరు, అక్టోబర్ 13: సబ్సిడీ సిలిండర్ల కోత ప్రభావం ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లపై కూడా పండింది. కేంద్ర ప్రభుత్వం కనెక్షన్‌దార్లందరికీ సబ్సిడీ సిలిండర్లపై నియంత్రణ విధించడం విదితమే. ప్రతి కనెక్షన్‌దారుడికి సంవత్సరానికి ఆరు సిలిండర్లను మాత్రమే సబ్సిడీ ధరకు అందజేసేందుకు సమాయత్తం కావడం తెలిసిందే. నిన్నమొన్నటి వరకు అవసరాలకు తగ్గట్లుగా సంక్షేమ హాస్టళ్లకు గ్యాస్ సిలిండర్లను సరఫరా చేస్తూ వచ్చిన డీలర్లు తాజాగా ఆయిల్ కంపెనీలు తెలిపిన మార్గదర్శకాలను అమలులోకి తీసుకొచ్చారు. గృహావసరాలకు అందజేసే సిలిండర్‌నే (14.2కిలోల)ను ప్రస్తుతం సంక్షేమ హాస్టళ్లకు 1260 రూపాయలకు విక్రయిస్తున్నారు. ఇప్పుడు ఆరు సిలిండర్లకుపోను మిగిలిన గ్యాస్‌పై గృహావసరాలకైతే 955 రూపాయల వరకు వసూలు చేయనున్నారు. అలా చూసుకున్నా హాస్టళ్లకు అందజేసే సిలిండర్ మరో మూడు వందల రూపాయల వరకు ఎక్కువగా ఉండటం గమనార్హం. సంక్షేమ వసతి గృహాల్లో ఒక్కో విద్యార్థికి రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన తలసరి బడ్జెట్ కేటాయింపులకు అనుగుణంగానే ఖర్చులుండాలి. ప్రస్తుత విద్యాసంవత్సరానికి సిలిండర్ 407.5 రూపాయల వంతున సంక్షేమ వసతిగృహాల బడ్జెట్ కేటాయింపుల్లో నివేదికలు నమోదయ్యాయి. సాధారణంగానే కొద్దికొద్దిగా గ్యాస్ ధరలు పెరిగినప్పుడే ఈ ప్రభావం ఎంతోకొంత ఆ శాఖపై పడి అధికార యంత్రాంగం సతమతమవుతుండటం విదితమే. మరలా వచ్చే ఏడాది వరకు ముందుగా తెలిపిన ధరలు, అదే బడ్జెట్‌తో నెట్టుకురావాలి. ఇప్పుడు ఏకంగా మూడింతలుగా గ్యాస్ ధరలు పెరగడం సంక్షేమ వసతిగృహాలు, విద్యార్థులపై భారంగా పరిణమిస్తోంది. తమకూ గృహావసరాలకు అందజేసే గ్యాస్ లెక్కల్లో గతంలో మాదిరి సరఫరా కొనసాగించాలంటూ వార్డెన్లంతా ఇటీవలకాలంలో డీలర్లపై వివాదాలకు దిగుతున్నారు. ఇందుకు సంబంధించి ఇంకా ఎలాంటి లిఖితపూర్వక ఆదేశాలు రాకున్నా ముందుగానే డీలర్లు హస్తలాఘవం చూపుతున్నారంటూ ఈ వ్యవహారం నెల్లూరు జిల్లా ఇన్‌చార్జి జాయింట్ కలెక్టర్ బి లక్ష్మీకాంతం దృష్టికి తీసుకెళ్లారు. అదనపు చెల్లింపులు ప్రభుత్వం భరిస్తుందా లేదా ప్రభుత్వం విద్యార్థులకిచ్చే పాకెట్ మనీలో చెల్లించాలని చేతులు దులుపుకుంటుందా తెలియాల్సి ఉంది.
సబ్సిడీ సిలిండర్ల కోత ప్రభావం ప్రభుత్వ
english title:
subsidy cut
Date:
Sunday, October 14, 2012