Quantcast
Viewing all articles
Browse latest Browse all 69482

ప్రముఖ సాహితీవేత్త ఘండికోట కన్నుమూత

Image may be NSFW.
Clik here to view.

విశాఖపట్నం, అక్టోబర్ 13 : ప్రముఖ సాహితీవేత్త ఘండికోట బ్రహ్మాజీరావు శుక్రవారం కన్నుమూశారు. పశ్చిమబెంగాల్‌లోని బర్నపూర్‌లో ఉద్యోగార్థమై ఉన్న కుమారుడు విశ్వనాథ్ ఇంటికి వెళ్ళిన బ్రహ్మాజీరావు అస్వస్థతతో ఉండి అక్కడే కన్నుమూశారు. 1922 డిసెంబర్ 23వ తేదీన శ్రీకాకుళం జిల్లా పొందూరులో జన్మించిన ఆయనకు ఆరుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. రైల్వేలో అనేక హోదాల్లో పనిచేసిన ఆయన సాహితీ సేవ చేశారు. సగటు మానవుని దైనందిన సమస్యలు పరిశీలించి తన రచనల్లో విశే్లషించిన అక్షరశిల్పి ఘంటికోట. ఉత్తరాంధ్ర, ప్రవాసాంధ్ర, బెంగాలీ జీవిత చిత్రాన్ని జమిలి ముద్రణలో అందించారు. ఘండికోట పేరు చెప్పగానే శ్రామిక శకటం, విజయవాడ జంక్షన్ చప్పున స్ఫురిస్తాయి. రైల్వే రంగాన్ని ఇతివృత్తంగా తీసుకుని రచనలు చేసిన ప్రథమ కథా, నవలా రచయిత ఘండికోటే. ఆయన కలం నుండి దాదాపు 30 నవలలు, 150 కథలు, పెక్కు వ్యాసాలు వెలువడ్డాయి. ఆయన నవలల్లో పరుగులిడే చక్రాలు, ప్రవహించే జీవనవాహిని, నవ్వింది నాగావళి, శ్రామిక శకటం, విజయవాడ జంక్షన్, నల్లమబ్బుకో వెండి అంచు, ప్రేమమూర్తి, రాగలత, గులాబీముళ్ళు, డాక్టర్ భాయి వంటివి పాఠకుల అమితాదరణకు పాత్రమయ్యాయి. తొలికథ 1941లో ప్రజాబంధులో వచ్చిన ‘రాఘవయ్య’తో సాహితీ యాత్ర ఆరంభించారు. ‘ఒక దీపం వెలిగింది’ నవల సినీద్వయం బాపు-రమణల నేతృత్వంలో ‘గోరంత దీపం’గా వచ్చింది. కేంద్ర సాహిత్య అకాడమీ ఆహ్వానం మేరకు అరేబియన్ నైట్స్‌ను వేయిన్నొక్క రాత్రులు పేరుతో,తెలుగులో అనువదించారు. ఆధ్యాత్మిక రచయితగా శ్రీమత్ సుందరకాండ-సౌందర్య దర్శనం (6 భాగాలు) వెలువరించారు.

ప్రముఖ సాహితీవేత్త ఘండికోట బ్రహ్మాజీరావు శుక్రవారం కన్నుమూశారు
english title: 
gandikota brahmaji rao

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>