పాడేరు, అక్టోబర్ 14: ఆంధ్ర-ఒడిశా సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టు మిలీషియా సభ్యులుగా వ్యవహరిస్తున్న నలుగురు గిరిజనులు పోలీసుల ఎదుట ఆదివారం లొంగిపోయారు. ముంచంగిపుట్టు మండలం మారుమూల ప్రాంతమైన బూసిపుట్టు పంచాయతీ సంతవీధి గ్రామానికి చెందిన పాంగి ముసిరి, పాం గి సప్రో, కుమడ పంచాయతీ కిముడుపుట్టుకి చెందిన కొర్రా రామచందర్, వంతాల రాజబాబు అనే మావోయిస్టు మిలీషియా సభ్యులు స్వచ్చంధంగా లొంగిపోయినట్టు పాడేరు అదనపు ఎస్.పి. ఎ.ఆర్.దామోదర్ తెలిపారు. ఆదివారం సాయంత్రం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ గత కొంతకాలంగా వీరు మావోయిస్టులకు సహకరిస్తుండడమే కాకుండా ఆర్టీసీ బస్సు, జీపు దగ్ధం సంఘటనలలోనూ, రహదారిని తవ్విన ఘటనలో ప్రత్యక్షంగా పాల్గొన్న ట్టు చెప్పారు. మావోయిస్టులు నిర్వహించే సమావేశాలకు హాజరు కావడం, కరపత్రాల పంపిణీ, మావోలకు భోజన సదుపాయం కల్పించడం వంటి చర్యలకు వీరు పాల్పడ్డారని పేర్కొన్నారు. స్వచ్చంధంగా వీరు తమకు లొంగిపోవడంతో వీరిపై ఎటువంటి కేసులు నమో దు చేయకుండా విడిచిపెడుతున్నామని చెప్పారు.
నలుగురు మిలీషియా సభ్యులకు కలెక్టర్ ద్వారా ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయల నగదు ప్రోత్సాహకా న్ని అందచేయనున్నట్టు ఆయన తెలిపా రు. తమకు లొంగిపోయిన వీరు భవిష్యత్తులో మావోల కార్యకలాపాలలో పా ల్గొనబోమని ధ్రువీకరిస్తూ బాండ్ రాసి ఇవ్వాల్సి ఉంటుందన్నారు. రానున్న కాలంలో మావోలకు సహకరించినా, వా రి కార్యకలాపాలలో పాల్గొన్నా కేసులు నమోదు చేసి అరెస్ట్ చేస్తామని ఆయన హెచ్చరించారు. ఇదిలాఉండగా ముం చంగిపుట్టు మండలంలోని పలు గ్రామాలలో మరో పదిమంది గిరిజనులు మావోల మిలీషియా సభ్యులుగా వ్యవహరిస్తున్నారని ఆయన చెప్పారు. ఒడిశాకు ఆనుకుని ఉన్న దిగువ కంఠవరం గ్రామానికి చెందిన కిల్లో రెల్లి, ఎగువ కంఠవరానికి చెందిన పాంగి గాసి, కిల్లో భాస్కరరావు, సాగినిపుట్టుకి చెందిన గొ ల్లోరి సోమర, కిల్లో కంద్రు, తాడిపుట్టు గ్రామానికి చెందిన కిల్లో కామేశ్వరరావు, బల్లిగుడకి చెందిన పాంగి రమేష్, సా యిగెడ్డకు చెందిన కిముడు గణపతి, నేరేడుపుట్టుకు చెందిన పాంగి సన్ను, సాకిరేవుకు చెందిన దారపు తిరుపతి అనే గిరిజనులు మావోల మిలీషియా సభ్యులుగా పనిచేస్తున్నందున వీరు స్వచ్చంధంగా తమకు లొంగిపోవాలని ఆయన సూచించారు. తమకు లొంగిపోతే ఎటువంటి కేసులు నమోదు చే యకుండా విడిచిపెడతామని, లేకుంటే అరెస్ట్ చేయాల్సి ఉంటుందని దామోదర్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పాడేరు, ముం చంగిపుట్టు ఎస్.ఐ.లు జి.అప్పన్న, వి.చక్రధరరావు పాల్గొన్నారు.
చంద్రబాబు మద్దతుగా ఎమ్మెల్యే గవిరెడ్డి పాదయాత్ర
కె.కోటపాడు, అక్టోబర్ 14: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నిర్వహిస్తున్న యాత్రకు మద్దతుగా మాడుగుల నియోజకవర్గంలో ఈనెల 18వతేదీ నుండి పాదయాత్రను నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు తెలిపారు. స్థానిక శివాలయం వద్దగల సామాజిక భవనంలో పార్టీ కార్యకర్తలు, నాయకులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తన పాదయాత్ర గోడపత్రికను ఆయన విడుదల చేశారు. అనంతరం కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజల నుండి దోచుకున్న విషయం నుండి ప్రజల దృష్టి మళ్లించేందుకు వైఎస్ షర్మిల పాదయాత్ర చేపడుతోందని, ఆమె పాదయాత్రను ప్రజలు నమ్మే స్థితిలో లేరని విమర్శించారు. ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు చంద్రబాబు యాత్రకు ప్రజల నుండి అనూహ్య మద్దతు లభిస్తుందన్నారు. తొలుత కె.కోటపాడు మండలంలోని లంకవానిపాలెం నుండి తాను పాదయాత్ర ప్రారంభించి అన్ని గ్రామాల్లో నిర్వహించనున్నానని తెలిపారు. గ్రామాల్లో ప్రజల సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సబ్బవరపు రామునాయుడు, బండారు ప్రసాద్, జూరెడ్డి రాము, కొరుపోలు జయరామ్, కశిరెడ్డి అప్పలనాయుడు, పైల అమ్మాజీ, బత్తి అప్పారావు పాల్గొన్నారు.