సబ్బవరం, అక్టోబర్ 14: బహిరంగ మార్కెట్‌లో బొప్పాయి పండ్లకు ధర పెరగటంతో మండలంలోని రైతులు ఈ పంట సాగుపై ఆసక్తికనబరుస్తున్నారు. గతంలో టన్నుబొప్పాయి ధర సుమా రు 6 వేల రూపాయలు ఉండగా, అది కాస్త 7000-7500 రూపాయల ధర ప లుకుతోందని రైతులు అంటున్నారు. కిలోల లెక్కన పండ్ల రసాల వ్యాపారులకు అమ్ముకున్నప్పటికీ కిలో7-50 రూ పాయలు చొప్పున విక్రయిస్తున్నామన్నారు. పల్లెల్లో పట్టణ సంస్కృతి పెరగటంతో కాలంతో పనిలేకుండా ప్రస్తు తం శీతల పానీయాల కొనుగోళ్లు పెరుగుతున్న నేపధ్యంలో బొప్పా యి,బత్తాయి,ధ్రాక్ష,పైనాపిల్,స పోటా,హైబ్రీడ్ దోస పండ్లకు గిరాకీ పెరిగిందంటున్నారు. ఇది గుర్తించిన రైతు లు ఇక్కడ పొలావు పండ్లతోటలకు అనుకూలించటంతో ఆ పంటల దిశగా పయనిస్తున్నారు. మండలంలోని ఆరిపాక,గుల్లేపల్లి,బోదువలస, గొర్లివానిపాలెం, అసకపల్లి,దేవీపురం లాంటి చోట్ల బొప్పాయి పంట సాగు విస్తీర్ణం అధికంగా కనిపిస్తోంది.
విస్తరణలో సాయినగర్ కాలనీ రోడ్లు
సబ్బవరం, అక్టోబర్ 14: సబ్బవరం పంచాయతీ పరిధిలోని సాయినగర్ కాలనీ (బిసి కాలనీ) రోడ్ల అభివృద్ధికి పంచాయతీ కార్యదర్శి రాపేటి రమేష్‌బాబు ప్రత్యే క శ్రద్ధ చూపిస్తున్నారు. దీంతో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు ఆదేశాల మేరకు పంచాయతీ సాధారణ నిధులు అవసరమైతే ఎమ్మెల్యే నిధులకు సిఫార్సు చేసి కూడా పలు రకాల అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నారు. పంచాయతీల సర్పంచుల పదవీకాలం ముగిశాక పంచాయతీకి ప్రత్యేక అధికారిగా నియమితులైన ఎంపిడిఒ సిహెచ్ వెంకటలక్ష్మి ఈ నెలాఖరుకు పదవీ విరమణ చేయనున్నా రు. దీంతో ఆమె హయాంలోనే పలు అభివృద్ధిపనులకు ప్రారంభోత్సవం చేయాలనే దృక్పదంతో సాయినగర్ కాలనీలో ఇప్పటివరకు ఆక్రమణలకు గురైన రోడ్లను వాటిని తొలగించి ముందుగా గ్రావెల్ రోడ్లుగా అభివృద్ధి చేసే పనులు చురుగ్గాసాగుతున్నాయి. ఇక్కడి శ్రీసీతారామ కల్యాణ మండపం మరమ్మతలు సౌండ్ సిస్టం మెరుగుపరిచే పనులకు సన్నద్దమవుతున్నామని కార్యదర్శి రమేష్ తెలిపారు.
వంటా వార్పుతో పర్యాటక కార్మికుల నిరసన
అనంతగిరి, అక్టోబర్ 14: తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పర్యాటక కార్మికులు ఐదు రోజులుగా చేస్తున్న సమ్మెలో భాగంగా ఆదివారం వంటావార్పు చేపట్టి కార్మికులు తమ నిరసన వ్యక్తం చేశారు. మండలంలోగల తైడా జంగిల్‌బెల్, అనంతగిరి హరిత రిసార్ట్స్, బొర్రాగుహల్లో పనిచేస్తున్న సు మారు 250 మంది కాంట్రాక్టు కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని సమ్మె కొనసాగిస్తున్నారు. పర్యాటక యూనిట్ల ద్వారా లక్షలాది రూపాయలు ఆదాయం ప్రభుత్వానికి సమకూరుస్తున్నప్పటికీ తమ చిన్నపాటి సమస్యలను పరిష్కరించడంలో ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో అర్ధం కావడం లేదని వారు వాపోయారు. సమ్మె చేసినప్పుడల్లా సమస్యలు పరిష్కరిస్తామని హామీలు ఇస్తున్నారే తప్ప పరిష్కరించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలాఉండగా పర్యాటక కార్మికులు చేపడుతున్న సమ్మెకు మద్దతుగా తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్, సి.పి.ఎం., నాయకులు, పలు ప్రజా సంఘాలు దీక్ష చేపడుతున్నారు. కార్మికులు సమ్మెతో అనేకమంది పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సుదూర ప్రాంతాల నుండి బొర్రాగృహలను సందర్శించేందుకు ఆదివారం వచ్చిన వందలాది మంది పర్యాటకులు తీవ్ర నిరాశతో వెనుదిరిగారు. అధికారులు స్పందించి పర్యాటక కార్మికుల సమ్మె విరమింపజేసేలా చర్యలు తీసుకోవాలని పర్యాటకులు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో పర్యాటక కార్మికుల సంఘం నాయకులు గాసి, లక్ష్మీనారాయణ, త్రినాధరావు, ప్రసాద్, పలు పార్టీల నాయకులు టి.లక్ష్మీ, టి.గంగరాజు, కె.గోవిందరావు, ఎస్.నాగులు, ఎస్.ఆనందరావు, రామస్వామి, వీరస్వామి పాల్గొన్నారు.
ఐదో రోజుకు చేరిన పర్యాటక కార్మికుల సమ్మె
అరకులోయ, అక్టోబర్ 14: కుదుర్చుకున్న ఒప్పందాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పర్యాటక అభివృద్ధి సంస్థ అతిథి గృహాలలో పనిచేస్తున్న ఉద్యోగ, ఒప్పంద, దినసరి వేతన కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె ఆదివారం నాటికి ఐదో రోజుకు చేరుకుంది. అరకులోయ, అనంతగిరి, తైడా, బొర్రా గుహల యూనిట్లలో పనిచేస్తున్న దాదా పు 350 మంది కార్మికులు ఈ నెల 10వ తేదీనుంచి సమ్మెబాట పట్టిన విషయం తెలిసిందే. తమ డిమాండ్లను ఆమోదిం చి అమలు చేసేంతవరకు ఆందోళనను విరమించేది లేదంటూ కార్మికులు మెం డు పట్టుపట్టి సమ్మెను కొనసాగిస్తున్నా రు. పర్యాటక అభివృద్ధి సంస్థ ఉన్నత అధికారులు ఆందోళనకారులతో ఈ నెల 13వతేదీ నుంచి చర్చలు జరపుతు న్నా ఇంతవరకు ఎటువంటి ఫలితం లేకపోయింది. మరోసారి చర్చలు సాగి తే సమస్యలు పరిష్కారం కాగలవనే అభిప్రాయం పలువురు వ్యక్తం చేస్తున్నా రు. రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థకు లక్షలాది రూపాయల నష్టం వాటిల్లుతుండడంతో ఈవిషయంపై రాష్ట్ర మం త్రులు గంటా శ్రీనివాసరావు, పసుపులేటి బాలరాజు జోక్యం చేసుకుని కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఐ.టి.డి.ఎ. ప్రాజెక్టు అధికారి శ్రీకాంత్ ప్రభాకర్, ఆర్.డి.ఒ. గణపతిరావులను ఆదేశించారు.
కార్మికులతో చర్చలు జరిపేందుకు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ చందనాఖాన్ అరకులోయ రావల్సి ఉన్నప్పటికీ మంత్రులు ఇందుకు అడ్డు తగిలినట్టు తెలుస్తోంది. తమ ప్రాంతంలో ఉన్న సమస్యను తామే పరిష్కరిస్తామని మం త్రులు చెప్పడంతో ఆమె పర్యటన రద్దయినట్టు తెలుస్తోంది. దీంతో పర్యాటక అధికారులు, ఐ.టి.డి.ఎ. ప్రాజెక్టు అధికారి, ఆర్.డి.ఒ.ల సమక్షంలో రెండో దఫా చర్చలు జరపనున్నారు.
అభివృద్ధికి చాపరాయి నిధులను వెచ్చించాలి
డుంబ్రిగుడ, అక్టోబర్ 14: గోల్‌మాల్ జరిగిన చాపరాయి టెండర్ నిధులను అధికారులు వసూలుచేసి చాపరాయి అభివృద్దికి వెచ్చించాలని పలు రాజకీయ పార్టీల నాయకులు సుబ్బారావు, ఎం.స్వామి, చిన్నబాబు, కోటేశ్వరరావు, దయానిది డిమాండ్ చేశారు. ఆదివారం వారు విలేఖరులతో మాట్లాడుతూ చాపరాయి నిధులను పంచాయతీ ఖాతాలో జమ చేయకుండా అధికారులు స్వంత ఖా తాల్లో ఉంచుకొని ఎటువంటి అభివృద్థి పనులు చేపట్టకపోవడం సరికాదన్నారు. ఈ విషయమై విచారణ చేపట్టి చాపరాయి నిధులను అభివృద్ధి పనులకు వెచ్చించాలని వారు కోరారు.
కేంద్ర మంత్రి దృష్టికి గిరిజన సమస్యలు
డుంబ్రిగుడ, అక్టోబర్ 14: మండలం లో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈనెల 19వ తేదీన అరకులో య ప్రాంతంలో పర్యటించే కేంద్ర మం త్రి కిశోర్ చంద్రదేవ్ దృష్టికి తీసుకువెళ్లనున్నట్టు కాంగ్రెస్ పార్టీ నాయకుడు శెట్టి గంగాధరస్వామి తెలిపారు. మండలంలోని గుంటసీమ, రంగిలిసింగ్, లైగండ గ్రామాల్లో ఆదివారం ఆయన పర్యటించి గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ప్రధానంగా రోడ్డు సౌకర్యం లేక గిరిజనులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నట్టు చెప్పారు. లివిటిపుట్టు నుంచి నెరేడువలస వరకు తారురోడ్డు నిర్మించాలని, గుంటసీమలో గిరిజనులకు ఇం దిరమ్మ గృహాలు మంజూరు చేయాలని, అరకు నుంచి గుంటసీమ వరకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని, గ్రామా ల్లో సురక్షిత తాగునీరు కల్పించాలని కోరుతూ కేంద్రమంత్రిని కోరనున్నట్టు ఆయన చెప్పారు.