హైదరాబాద్, అక్టోబర్ 15: రానున్న దశాబ్దం పాటు హైదరాబాద్ జీవవైవిధ్య అంతర్జాతీయ సదస్సు ప్రపంచానికి మార్గం చూపుతుందని కనె్వన్షన్ ఆఫ్ బయోడైవర్సిటీ (సిబడి) ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ బ్రౌలియో ఫెరీరా డిసౌజా డియాజ్ సోమవారం నాడు పేర్కొన్నారు. అత్యున్నత వేదిక హైలెవెల్ సెగ్మెంట్‌ను భారత ప్రధాని మన్మోహన్‌సింగ్ మంగళవారం ప్రారంభిస్తారని, ఈ చర్చలు మూడు రోజుల పాటు 17వ తేదీ నుండి జరుగుతాయని బ్రౌలియో పేర్కొన్నారు. ‘ హైదరాబాద్ సదస్సు చాలా పురోగతితో సాగడం సంతోషదాయకం, ఈ సదస్సు నుండి చాలా ప్రగతిని సాధించగలమని అనుకుంటున్నాం, సైడ్ ఈవెంట్స్‌లో అనేక సంస్థల ప్రతినిధులు , ప్రజలు తమ ఆలోచనలు, అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు’ అని బ్రౌలియో సోమవారం వ్యాఖ్యానించారు. జీవవైవిధ్యానికి సంబంధం ఉన్న అన్ని విభాగాల ప్రతినిధులు ఈ సదస్సులో భాగస్వామ్యం అవుతున్నారని, కొత్త కొత్త భాగస్వామ్య దేశాలు సదస్సుకు హాజరై తమ అభిప్రాయాలను చెబుతున్నాయని సిబిడి ఆయన వివరించారు. లక్ష్యాలను అమలుచేసే దిశగా, అజెండా ప్రక్రియను చాలా వేగవంతం చేశామని, దానికి అన్ని దేశాలు ఎంతో సహకరించడం చాలా ఆనందదాయకమైన విషయమని ఫెరీరా అన్నారు. ‘నిజానికి మనం ఈ సీరియస్ ప్రక్రియను కేవలం రెండేళ్ల క్రితం ప్రారంభించాం, ఇపుడిపుడే అన్ని దేశాలూ మన మాట వింటున్నాయి. వివిధ దేశాల పర్యావరణ మంత్రిత్వశాఖలు అర్ధం చేసుకుంటున్నాయి, ఏం చేయగలమని ఆలోచిస్తున్నాయి, ఇదో రకంగా అవగాహన అప్రెంటీస్‌గా చెప్పవచ్చు, ఆలోచించడం మొదలుపెట్టడం అంటే మనం చాలా సాధించినట్టు లెక్క’ అని బ్రౌలియో సంతోషం వ్యక్తం చేశారు.
సిబిడి ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ బ్రౌలియో
english title:
hyderabad sadassu
Date:
Tuesday, October 16, 2012