బీహార్‌లోని బంకా జిల్లా జైత్‌పూర్‌లో అంతా సంతాలీలే వుంటారు. చిత్రంగా ఉండే వారి నీతి నియమాలు ఇటీవల మలుపు తిరిగాయ్. వాళ్ల ఆచారం ప్రకారం- ఆడా, మగా కలిసి వుండొచ్చును- పెళ్లి చేసుకోకపోయినా సరే. చుడ్కీ హేమాబ్రమ్ అనే స్ర్తి- మహలాల్ మారండీ అనే పురుషుడూ పదేళ్లుగా కాపురం చేస్తూ, నలుగురు పిల్లల్ని కన్నారు. మహలాల్ రోగంతో మరణించాడు. పురుషుడు పెళ్లిచేసుకోకుండా మరణిస్తే- అతని ప్రేయసి లేదా జీవిత భాగస్వామిని- వితంతువు కాదు, ఆస్తిపాస్తులపై హక్కు రాదు. చుడ్కీ సమస్య మరీ సంక్లిష్టం. చట్ట ప్రకారం ఆ నలుగురూ తన సంతానం కాదు. అక్రమ సంతానానికి తండ్రి ఇంటి పేరు రాదు. అది- ఆ సంతాలీ జాతి కట్టుబాటు. గ్రామ పెద్దలంతా-మహలాల్ మారండీ అంత్యక్రియలకు హాజరైనారు. చుడ్కీ ఏకధారగా ఏడుస్తోంది. గ్రామ పెద్దల గుండెలు కరిగాయి. ఆమె ‘వితంతువు’ అయితేనే మహలాల్‌కున్న కాస్త భూమి ఆమెకీ, పిల్లలకీ దక్కుతుంది. మహలాల్ భౌతిక కాయం ముందు- పెళ్లి పీటలు ఏర్పాటుచేశారు. ఆమెని పెండ్లి కుమార్తెను చేశారు. ‘‘శవం చెయ్యిని తామే పట్టుకొని లేపి ఆమె నుదుట పసుపు, కుంకుమ అద్దించారు. వివాహం అయిపోయింది. వెంటనే, ఆమె నొసటి కుంకుమను అమ్మలక్కలు చెరిపేశారు. అంతే! ఆమె విధవరాలైంది!
‘చావు’ వేరుచేసే దాకా విడిపోము’ అన్న శపథం - చావు తర్వాత కూడా ‘విడిపోము’ అన్నట్లుంది. అరుదైన గ్రామస్తుల ఔదార్యంతో... ఇది పరిష్కరణ కాదా?
బీహార్‌లోని బంకా జిల్లా జైత్‌పూర్‌లో అంతా సంతాలీలే వుంటారు
english title:
veerji
Date:
Saturday, October 20, 2012