క్షత్రనీతి క్రమంబులు గావ సూవె
నికృతియును జూదమును, ధర్మనిత్యులైన
వారి కీ రెండు వర్జింప వలయు నెందుఁ
బాపవృత్తంబు జూదంబు పార్థివులకు
భావం: దుర్యోధనుడు యుధిష్టిరునితో అనఘా! ఈ సభలో కాలక్షేపంగా ద్యూతం ఆడుదామా? అన్నాడు. దానికి స్పందించిన ధర్మరాజు మొదటిలా అన్నాడు. ఇతరులను వంచించటం, జూద మాడటం క్షత్రియుని నీతికి ఉచితమైనవి కావు సుమా! ధర్మాన్ని ఎడతెగకుండా పాటించేవారు ఈ రెంటినీ సర్వకాలాలలోను, సర్వదేశాలలోను వదిలివేయాలి. భూమినేలే ధర్మంలో ఉన్నవారికి ద్యూతం పాపకార్యం. కలి ప్రవేశించడానికి పరీక్షిత్తు దగ్గరనుంచి రాబట్టుకొన్న వరాలలో దూత్యంకూడా ఒకటి కనుక. జూదమాడటం వల్ల అబద్దాలు వాటిని కప్పిపుచ్చడానికి దుశ్చర్యలు చేయాల్సి వస్తుంది. అసలు జూదమే లేకపోతే అబద్దాలు ఆడవలసిన అవసరం రాదు. ఆబద్దాలే ఆడవలసిన అవసరం లేకపోతే దుశ్చర్యలు కాని దుష్ట ఆలోచనలుగాని ఉండవు.అపుడు సదాచారము, సద్భావనలు కలుగుతాయ. దాని వల్ల తనకే కాక సంతోషాన్ని నలుగురికీ పంచవచ్చు. దీన్ని మొదట రాజ్యానే్న లే వారుపాటిస్తే మిగతావారు తప్పక పాటిస్తారు. అందుకే ధర్మారాజు ఇలా చెప్పారు.
ఆంధ్ర మహాభారతంలోని పద్యమిది నిర్వహణ: శ్రీపావని సేవా సమితి, హైదరాబాద్