విశాఖపట్నం, అక్టోబర్ 20: విశాఖ శ్రీ శారదా పీఠంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారి జన్మ నక్షత్రమైన మూల నక్షత్రాన పీఠంలో మూలా నక్షత్ర పూజలు అత్యంత ఘనంగా జరిగాయి. శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి శుభాశీస్సులతో వేలాది మంది భక్తులు అమ్మవారికి పూజలు నిర్వహించారు. వందలాది మంది పిల్లలకు అక్షరాభ్యాస కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగాయి. పిల్లల ఉజ్వల భవిష్యత్‌కు చదువు, సంస్కారం అవసరమని, సర్వతీదేవి వీటిని అందిస్తుందని అన్నారు. బాహ్య శరీరం ఎంత అందంగా ఉన్నా, మనసు, నడవడికతోనే మనిషి అత్యున్నత స్థానాలను అందుకోగలుగుతాడని స్వరూపానందేంద్ర అన్నారు. సంపాదించిన విజ్ఞానంతో హిందూ మత సంరక్షణ, దేశ ప్రగతికి పనికి వచ్చే కార్యక్రమాలు చేయాలని ఆయన ఆకాంక్షించారు. పెడతోవ పడుతున్న పిల్లలకు మంచి బుద్ధిని ప్రసాదించి, సనాతన ధర్మాల వైపు వారిని నడిపించాలని ఆయన కోరారు. శ్రీ శారదా మాత ఆనందవల్లి, కల్పవల్లిగా స్వరూపానందేంద్ర కీర్తించారు. ఈ సందర్భంగా అన్న సంతర్పణ, ప్రసాద వితరణ జరిగింది. వివిధ జిల్లాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు.
విశాఖ శ్రీ శారదా పీఠంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి
english title:
s
Date:
Sunday, October 21, 2012