విశాఖపట్నం(క్రైం), అక్టోబర్ 20: నగరంలోని ఫిషింగ్ హార్బర్ వద్ద జరుగుతున్న మేరైన్ పోలీసు స్టేషన్‌ను నిర్మాణాన్ని స్థానిక మత్స్యకారులు శనివారం అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, మత్స్యకారులకు కొద్దిసేపు వాగ్వివాదం జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో, సమస్య పరిష్కారానికి పోలీసు ఉన్నతాధికారులు, మత్స్యకార నాయకులు రంగంలోకి దిగి ప్రస్తుతం చర్చలు జరుపుతున్నారు.
ఉగ్రవాదులు, తీవ్రవాదులు తీర ప్రాంతాల గుండా భారత భూభాగంలోకి చొరబడే అవకాశాలున్నాయని నిఘా వర్గాలు హెచ్చరించడంతో తీర ప్రాంతాల భద్రతను మరింతగా పెంచేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రాష్ట్రంలోని తీర ప్రాంతాలలో 15చోట్ల మెరైన్ పోలీసు స్టేషన్లను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి విదితమే.
నగరంలోని రుషికొండ తీరంలో ఇప్పటికే మెరైన్ పోలీసు స్టేషన్ ఉండగా, షిపింగ్ హార్బర్ సమీపంలో మరో మెరైన్ పోలీసు స్టేషన్ నిర్మాణాన్ని అధికారులు ప్రారంభించారు. ఈనెల చివరకు నిర్మాణం పూర్తి చేసి 29న నగరానికి విచ్చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిచే నూతన మెరైన్ పోలీసు స్టేషన్‌ను ప్రారంభించనున్నారు. ఈ తరుణంలో అధికారులు పోలీసు స్టేషన్ నిర్మాణాన్ని సీరియస్‌గా తీసుకుని నిర్మాణపు పనులు చేయిస్తున్నారు.
అయితే పోలీసు స్టేషన్‌ను ఏర్పాటు చేయడం వలన తమ ఉపాధి దెబ్బతిని అవకాశముందని స్థానిక మత్స్యకారులు నిర్మాణపు పనులను శనివారం సాయంత్రం అడ్డుకున్నారు. తమ ఉపాధిని దెబ్బతిసే మెరైన్ పోలీసు స్టేషన్ నిర్మాణాన్ని వెంటనే నిలిపి వేయాలని సుమారు వంద మంది మత్స్యకారులు ఆందోళనకు దిగారు. దీంతో మెరైన్ పోలీసులు, ఒకటో పట్టణ పోలీసులు రంగంలోకి మత్స్యకారులను శాంతింప చేయడానికి కృషి చేశారు. చేపల వేటకు వెళ్లి తీసుకుని వచ్చిన కొన్ని చేపలను షిఫింగ్ హార్బర్ తీరం ఒడ్డున ఎండిబెట్టి వాటిని విక్రయిస్తూ కొంత నగదును సంపాదిస్తుంటామని, సరిగ్గా ఇదే స్థలంలో పోలీసు స్టేషన్ నిర్మాణ పనులు జరుగుతుండడంతో ఇక చేపలను ఎక్కడ ఎండబెట్టేదని మత్స్యకారులు ప్రశ్నిస్తున్నారు. ఆందోళనతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పెద్ద ఎత్తున పోలీసు బలగాలను రంగంలోకి దించారు. మత్స్యకార నాయకులు ఆందోళన కారులతో మాట్లాడడంతో పరిస్థితి కొండమేర సద్గుమణిగింది. పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో నిర్మాణపు పనులు చేయలేమని కాంట్రాక్టర్, తన సిబ్బందితో అక్కడ నుండి వెళ్ళిపోయారు. సమాచారం అందుకున్న మెరైన్ డిఎస్‌ప్ సిఎమ్ నాయుడు, ఎసిపి ఎస్.వెంకటరావు, మెరైన్ సిఐ సిహెచ్.ప్రసాద్, వన్‌టౌన్ సిఐ ఎలియా మహ్మమద్, పోర్టు అధికారులు, ఫిషింగ్ హార్బర్ అధికారులు ప్రస్తుతం దీనిపై చర్చలు జరుపుతున్నారు. మత్స్యకారులు శాంతించినట్టయితే తిరిగి సోమవారం నుండి నిర్మాణపు పనులు కొనసాగే అవకాశముంది.
నగరంలోని ఫిషింగ్ హార్బర్ వద్ద జరుగుతున్న
english title:
m
Date:
Sunday, October 21, 2012