Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

బుడతడికి ‘విస్కీ’ కిక్!

$
0
0

వేల్స్‌కి చెందిన - ‘స్వాన్‌సీ’ నగరంలో రెండేళ్ల బాలుడు- సోనీరీస్- పుట్టన రోజున పార్టీని ఇవ్వడానికి అతడి అమ్మా, నాన్నా ఓ పెద్ద హోటల్ని ఎంచుకున్నారు. ఫ్రాంకీ అండ్ బెన్నీ రెస్టారెంట్లు చాలా పాప్యులర్. పార్టీలో (పెద్దలకి మాత్రమే) విస్కీ కూడా పోశారు. పార్టీ రంజుగా సాగుతోంది. పిల్లవాడు కూడా - ‘విస్కీ’ చప్పరించేశాడు. అది గొంతులోకి దిగాక ‘యాక్కూ’ అంటూ మొహం ఇలా, అలా తిప్పి వేషాలు వేస్తూ వుంటే- తల్లికి అనుమానం వచ్చి- వాడి గ్లాసులోని ద్రవాన్ని చప్పరించి, రుచి చూసి- ‘‘బాబోయ్!’’అంటూ తేలు కుట్టినట్లు అరిచింది. ‘‘ఇది విస్కీ!’’ అని.
పసివాడు ఆ పాటికే మత్తులో స్పృహ కోల్పోతున్నాడు. బాలుడ్ని తీసుకుని ఆసుపత్రికి పరుగులు తీశారు. రెస్టారెంట్ వారు- ‘సారీ’ చెప్పారు. ‘‘ ఇది కేవలం వెయిటర్‌ల మిస్టేక్ అయ్యుంటుందిది. మరోసారి ఇలా జరగనివ్వం’’- అని కూడా వారు హామీ యిచ్చారు! ఓ సారి అనుభవమయ్యాక మరోసారి ఎవరు పోతారు ఆ హోటల్‌కి?
కొసవిరుపు
మనవాళ్లు- ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో - ‘టమాటా’ పండు లేకుండా ఏ ఒక్క పూటా తిండి తినరు. ఇలా టమాటాలు తినడం- ప్రోస్టేటు గ్రంధికి దెబ్బ అంటారు గానీ- ఫిన్లాండులో- బృహత్తర పరిశోధన ఒకటి చేశారు. టమాటాలలో- దానికి ఎర్రటి రంగునిచ్చే ‘లైకోపిన్’ వుంటుందే- అది మనిషి రక్తంలో చాలా ముఖ్యమట. అది తగ్గితే గుండెకు ‘స్ట్రోక్’ వచ్చే ప్రమాదం ఎక్కువట. టమాటాలు మక్కువగా (రసం అయితే బెటర్) తినేవాళ్లకి స్ట్రోక్ రాగల ఛాన్సులు 55 శాతం తక్కువట. ... టమాటాకీ జై!

వేల్స్‌కి చెందిన - ‘స్వాన్‌సీ’ నగరంలో రెండేళ్ల బాలుడు-
english title: 
budatadu
author: 
- వీరాజీ veeraji@sify.com

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>