పితృదేశమ్మున బృథివీశ్వరత్వంబు
విడిచి సానుజుడై పవిత్ర చరిత
జానకి దోడ్కొని చని వనంబున నున్న
రఘుకుల నందను రాము దొల్లి
చూచితి, నిపుడు భూసుర వంశ పోషకు
సాథు జనస్తుత్యుసత్యధర్మ
నిత్యు ధర్మజు రమణీయ కీర్తి ప్రియు
శమవంతు జూచితి సగరభరత
నలయయాతివైన్య నాభాగు లాథిగా
నాది రాజులెల్ల నధిక ధర్మ
సత్య యుక్తి జేసి సకల లోకంబులు
వడసి భాగధేయ భాగులైరి
భావం: అపుడు తండ్రిమాటపై తన సతిని సోదరుడిని తీసుకొని వెళ్లిన రాముడిని చూశాను. ఇపుడు సత్యధర్మాలను పొషించేవాడు విప్రులను పోషించేవాడు మంచివారిచేత కొనియాబడే వాడూ అయన ధర్మరాజును చూస్తున్నాను. నలుడు, యయాతి, పృథువు, నాభాగుడు మొదలైన రాజులందరూ సత్యధర్మాలను పాటించి ఉత్తమములైన స్వర్గలోకాలను సాధించారు. అదృష్టవంతులుగా గణనకు వచ్చారు. అని అరణ్యవాసం చేస్తున్న ధర్మారాజులతో ఉన్న ద్రౌపదిని చూసి మార్కండేయ మహర్షి అన్నారు.
ఆంధ్ర మహాభారతంలోని పద్యమిది నిర్వహణ: శ్రీపావని సేవా సమితి, హైదరాబాద్