డిచ్‌పల్లి రూరల్, అక్టోబర్ 23: కొరట్‌పల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ఐడిసిఎంఎస్ చైర్మన్ మునిపల్లి సాయిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులు కొనుగోలు కేంద్రాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రవాణా చార్జీలు మిగులుతాయనే ఉద్దేశ్యంతో పంట కళ్లాల్లోనే ధాన్యం విక్రయిస్తే, దళారులు అనేక రకాలుగా మోసగించే ప్రమాదం ఉందని హితవు పలికారు. నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ, కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తరలిస్తే పూర్తిస్థాయిలో మద్దతు ధర అందడమే కాకుండా, ఎలాంటి మోసాలకు తావుండదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సిపి మండల అధ్యక్షుడు శ్రీనివాస్, డిసిసిబి డైరెక్టర్లు న్యాస రాజేశ్వర్, పాశం నర్సింలు, నాయకులు లక్ష్మినారాయణ తదితరులు పాల్గొన్నారు.
....................
‘బాబు’ పాదయాత్రను అడుగడుగునా అడ్డుకుంటాం
డిచ్‌పల్లి రూరల్, అక్టోబర్ 23: తెలంగాణ ప్రాంతంలో తెదెపా అధినేత చంద్రబాబు చేస్తున్న పాదయాత్రను అడుగడుగునా అడ్డుకుంటామని టిఆర్‌ఎస్ డిచ్‌పల్లి నియోజకవర్గ ఇంచార్జ్ డాక్టర్ భూపతిరెడ్డి హెచ్చరించారు. డిచ్‌పల్లి మండల కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, టిఆర్‌ఎస్‌తోనే తెలంగాణ సాధ్యమని, కేంద్రంపై ఒత్తిడి పెంచి ఆరు నూరైనా ప్రత్యేక రాష్ట్రం సాధించుకుంటామని స్పష్టం చేశారు. తెలంగాణ పట్ల ఇప్పటికీ చంద్రబాబు ద్వంద్వ వైఖరినే అవలంభిస్తున్నారని దుయ్యబట్టారు. మొన్నటికి మొన్న కేంద్రానికి చంద్రబాబు రాసిన లేఖలోనూ తెలంగాణ పట్ల స్పష్టమైన వైఖరిని వెల్లడించకుండా నాన్చుడు ధోరణిని అవలంభించారని విమర్శించారు. తెలంగాణపై పార్టీ నిర్ణయాన్ని స్పష్టం చేయకుండా తెలంగాణలో పాదయాత్ర నిర్వహించడం సిగ్గుచేటని అన్నారు. తెదెపా వైఖరిని వెల్లడించేంత వరకు చంద్రబాబును తెలంగాణ జిల్లాలలో అడుగడుగునా అడ్డుకుంటామని హెచ్చరించారు. తెలంగాణకు మొదటి నుండీ కాంగ్రెస్ పార్టీ మోసగిస్తూ, మభ్యపెడుతూ వస్తోందని, అదే బాటలో చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్, టిడిపి పార్టీలను ప్రజలను విశ్వసించకుండా గట్టిగా నిలదీయాలని ఆయన పిలుపున్చారు. విలేఖరుల సమావేశంలో టిఆర్‌ఎస్ నాయకులు శాదుల్లా, చందర్, లాయక్‌అలీ, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఐడిసిఎంఎస్ చైర్మన్ సాయిరెడ్డి
english title:
k
Date:
Wednesday, October 24, 2012