నిజామాబాద్ టౌన్, అక్టోబర్ 23: నగరంలోని నాల్గవటౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గల ఓ ఇంట్లో చోరీకి పాల్పడిన ముగ్గురు సభ్యులు గల దొంగల ముఠాను పట్టుకుని, వారి వద్ద నుండి 14తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని అదనపు ఎస్పీ పివి.పద్మజ తెలిపారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. గత నెల 24వ తేదీన వినాయక్‌నగర్‌లోని యాదగిరిబాగ్‌లో గల జి.మారుతిగౌడ్ ఇంట్లో చోరీ జరిగిందని, 26తులాల బంగారు నగలు అపహరణకు గురైనట్టు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడని చెప్పారు. దీంతో దొంగల ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలచే గాలింపులు చేపట్టామని అన్నారు. ఈ క్రమంలోనే మంగళవారం కుమార్‌గల్లిలో ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పద రీతిలో సంచరిస్తున్నారనే సమాచారం మేరకు నగర సిఐ సైదులు నేతృత్వంలోని పోలీసు సిబ్బంది వారిని అదుపులోకి తీసుకుని విచారణ జరిపిందన్నారు. ఈ సందర్భంగా మారుతిగౌడ్ ఇంట్లో చోరీకి పాల్పడింది తామేనని పట్టుబడ్డ నిందితులు అంగీకరించారని అన్నారు. మహారాష్టల్రోని నాందేడ్ జిల్లా కొండల్‌వాడి ప్రాంతానికి చెందిన ఆకులవార్ రాజేందర్, వరంగల్‌కు చెందిన భరత్‌కుమార్‌శర్మ, లకన్‌కుమార్ శర్మలు ఈ చోరీకి పాల్పడ్డారని, వీరిని అరెస్టు చేసి 4.25లక్షల రూపాయల విలువ చేసే 14తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని వివరించారు. ఇతర చోరీ కేసులతోనూ సదరు ముఠాకు ప్రమేయం ఉండవచ్చనే అనుమానంతో మరోమారు తమ కస్టడీలోకి తీసుకుని సమగ్ర విచారణ జరుపుతామన్నారు. చాకచక్యంగా వ్యవహరించి దొంగలను పట్టుకుని పోలీసు అధికారులు, సిబ్బందిని ఎఎస్పీ అభినందించారు. విలేఖరుల సమావేశంలో నిజామాబాద్ డిఎస్పీ రాంమోహన్‌రావు, నగర సిఐ సైదులు, నాల్గవటౌన్ ఎస్‌ఐ చంద్రశేఖర్‌లు పాల్గొన్నారు.
నగరంలోని నాల్గవటౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గల ఓ ఇంట్లో చోరీకి పాల్పడిన ముగ్గురు సభ్యులు గల
english title:
m
Date:
Wednesday, October 24, 2012