వరంగల్ బల్దియా, అక్టోబర్ 23: వరంగల్ నగరంలోని శ్రీ భద్రకాళి దేవాలయంలో దేవి శరన్నవరాత్రులు కన్నుల పండువగా జరుగుతున్నాయి. నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మంగళవారం భద్రకాళి అమ్మవారు మహిషాసురమర్థిని అలంకరణంలో భక్తులను అలరించారు. ఆలయ ప్రధానార్చాకులు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో అమ్మవారికి ఉదయం నాలుగుగంటలకు సుప్రభాతసేవతో ప్రారంభమై నిత్యాహ్నికం, చతుస్థానార్చాన నిర్వహించి మహిషాసురమర్థినిగా అలంకరించారు. భద్రకాళి అమ్మవారికి సిద్దిదాత్రి దుర్గాక్రమంలో పూజాదికాలు జరిపి మహానవమీ కృత్యమును వైభవోపేతంగా జరిపారు. శుంభహా దుర్గార్చన, చతురన్త సేవ, పూర్ణాహుతి, బలిప్రదానం, కూష్మాండ బలి ఘనంగా నిర్వహించారు. సాయంత్రం ఏడుగంటలకు సర్వభూపాల వాహనసేవపై ఊరేగించారు. సిబిఐ జడ్జి (బెంగుళూరు) వెంకట సుదర్శన్, వరంగల్ ఎంపి సిరిసిల్ల రాజయ్య, మాజీ ఎంపి డాక్టర్ కల్పనదేవి తదితరులు భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా సాయంత్రం ఐదుగంటలకు శ్రీరాగరంజని సంగీత శిక్షణాలయం ప్రధానాచార్యులు ముక్కామల ప్రసన్న శిష్యబృందంచే కర్నాటక సంగీతం భక్తులను మంత్రముగ్దులను చేసింది. ది స్కూల్ ఆఫ్ కర్నాటక సంగీత ప్రధానాచార్యులు ఎండి.లాయక్‌అహ్మద్ శిష్య బృందంచే రాగలహరి, అష్టావధాని డాక్టర్ ప్రభల సుబ్రహ్మణ్యశర్మ మహాభారతం అరణ్యపర్వంపై ప్రవచనాలు జరిపారు. ఆలయ ఇఓ కట్టా అంజనీదేవి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది జయశంకర్, విజయ్ పాల్గొన్నారు.
వరంగల్ నగరంలోని శ్రీ భద్రకాళి దేవాలయంలో
english title:
m
Date:
Wednesday, October 24, 2012